మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన ‘కన్నప్ప’ (Kannappa) ఫైనల్ గా అతనికి మంచి ఫలితాన్నే ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండి ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వంటివి వచ్చినప్పుడు దారుణంగా ట్రోలింగ్ జరిగింది. మంచు విష్ణు ‘శివయ్యా..’ అంటూ పలికే డైలాగ్ ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. ‘సింగిల్’ వంటి సినిమాలో కూడా ఆ ట్రోలింగ్ రిఫరెన్స్ ను వాడటం జరిగింది. ఇలా జరిగిన ట్రోలింగ్ పై మంచు విష్ణు తగిన చర్యలు తీసుకున్నాడు.
కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి, మిగిలిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కి స్ట్రైకులు వేశారు. దీని వల్ల సినిమాపై ట్రోలింగ్ తగ్గింది. ముఖ్యంగా సినిమా రిలీజ్ కి ముందు సినిమాపై కనుక నెగిటివ్ రివ్యూలు పెడితే కేసులు పెడతామని కూడా మంచు విష్ణు హుకుం జారీ చేయడం జరిగింది. అలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వల్ల కూడా ‘కన్నప్ప’ ని ట్రోల్ చేయడానికి మేకర్స్ భయపడ్డారు. కొంతమంది నెగిటివ్ టాక్ చెప్పినా.. హద్దులు దాటలేదు. అందువల్ల ‘కన్నప్ప’ థియేట్రికల్ రన్ బాగానే నడిచింది.
దీని వల్ల లాభాలు వచ్చాయి అని చెప్పలేం కానీ సినిమాకి రావాల్సిన అప్రిసియేషన్ అయితే వచ్చింది. ఈ పద్ధతి దిల్ రాజుకి కూడా నచ్చింది. దీంతో ‘తమ్ముడు’ ప్రమోషన్స్ లో విష్ణుపై ప్రశంసలు కురిశాయి. దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ.. ” మంచు విష్ణు ఫాలో అయిన విధానం మంచిదని మాకు అర్థమైంది. ఇదే పద్ధతిని మేము కూడా ఫాలో అవ్వాలని అనుకుంటున్నాం.
ఎఫ్.డి.సి చైర్మన్ గా దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తాం. కొంతమంది పనిగట్టుకుని సినిమాపై విషం చిమ్ముతున్నారు. అలాంటి వాళ్ళని అరికట్టడానికి మంచు విష్ణు తీసుకున్న స్టెప్ మంచిదే. వాళ్ళ వల్ల నిర్మాతకి నష్టాలు తప్పడం లేదు.. సినిమా బ్రతకడం లేదు, థియేటర్ల వ్యవస్థకి కూడా ఇబ్బంది వచ్చి పడుతుంది” అంటూ చెప్పుకొచ్చారు. ఈ రకంగా మంచు విష్ణు ప్రయత్నాన్ని దిల్ రాజు (Dil Raju) మెచ్చుకోవడం విశేషం అనే చెప్పాలి.