అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా అమృత అయ్యర్ (Amritha Aiyer) హీరోయిన్ గా ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న సుబ్బు (Subbu Mangadevi) ఈ చిత్రానికి దర్శకుడు. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ(Rajesh Danda) ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ వంటివి మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి.
విశాల్ చంద్రశేఖర్ సంగీతంలో రూపొందిన పాటలు కూడా బాగున్నాయి. ఈ క్రమంలో ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలకి, అలాగే అల్లరి నరేష్ స్నేహితులకి ‘బచ్చల మల్లి’ సినిమా స్పెషల్ షో వేశారు. వారి టాక్ ప్రకారం.. ‘బచ్చల మల్లి’ సినిమా రన్ టైం 2 గంటల 40 నిమిషాల వరకు ఉందట. హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో సినిమా స్టార్ట్ అయ్యిందట. హీరో క్యారెక్టరైజేషన్ ని బాగా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.
అల్లరి నరేష్.. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘బచ్చల మల్లి’ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేశాడట. మాస్ ఆడియన్స్ కి కూడా ఈ పాత్ర నచ్చుతుందని అంటున్నారు. అల్లరి నరేష్ అంటే బచ్చల మల్లి సీరియస్ గా చేసే పనులు కూడా ఆడియన్స్ ని నవ్విస్తూ ఉంటాయట. సినిమాలో సిట్యుయేషన్ కామెడీ ఉంటుందట. హీరోయిన్ కి పెట్టిన బ్యాక్ స్టోరీ కూడా బాగుందని అంటున్నారు. తల్లి పాత్రలో రోహిణి కన్నీళ్లు పెట్టిస్తుంది అని అంటున్నారు.
సెకండాఫ్ ను కూడా డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశాడట. క్లైమాక్స్ అయితే అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేస్తుందట. బరువెక్కిన హృదయాలతో ప్రేక్షకులు థియేటర్ నుండి బయటకు వస్తారని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. ‘బచ్చల మల్లి’ మేకర్స్ అయితే సినిమాలో ఏముంటుంది అనేది ముందు నుండి చెప్పి ఆడియన్స్ ని ప్రిపేర్ చేశారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.