కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కేసుల సంఖ్య పెరిగిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మొదటి దశతో పోలిస్తే రెండో దశలో ఈ వైరస్ తాకిడి మరింత ప్రమాదకరంగా మారింది. వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. హాస్పిటల్స్ అన్నీ కూడా కరోనా బాధితులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో వైద్య సౌకర్యాలకు కొరత ఏర్పడుతోంది. ఈ క్రమంలో ప్రజలకు సాయం చేయడానికి ముందుకొచ్చారు నందమూరి బాలకృష్ణ.
రీసెంట్ గా బాలయ్య ప్రస్తుతం పరిస్థితులను వివరిస్తూ.. ఎవరూ బయటకు రాకుండా, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ.. ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. తాజాగా హిందూపురం కరోనా బాధితుల కోసం రూ.20 లక్షల విలువైన కోవిడ్ మెడిసిన్స్ ను హైదరాబాద్ నుండి పంపించారు. బాలయ్య పంపిక కోవిడ్ కిట్ లను తెలుగుదేశం పార్టీ నేతలు బాధితుల బంధువులకు అందించారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో ‘అఖండ’ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచేసింది. నిజానికి మే నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా సినిమాను వాయిదా వేసుకున్నారు.