సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) , దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) కలయికలో వచ్చిన ‘జైలర్’ (Jailer) చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ముందు రజినీకాంత్ ప్లాపుల్లో ఉన్నారు. దర్శకుడు నెల్సన్ తీసిన ‘బీస్ట్’ (Beast) కూడా అంతగా ఆడలేదు. అందువల్ల 2023 ఆగస్టు 10న పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ‘జైలర్’.. మౌత్ టాక్ తోనే బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా రజినీకాంత్ కు పర్ఫెక్ట్ కంబ్యాక్ సినిమా అని అంతా ప్రశంసించారు.
అతని ఏజ్ కి ఇమేజ్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయిన కథ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎగబడి చూశారు. అలాగే ‘జైలర్ 2’ లో ఇంకో హైలెట్ గురించి చెప్పాలి అంటే కచ్చితంగా అవి శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) , మోహన్ లాల్(Mohanlal) వంటి స్టార్ హీరోల కేమియోలే అని చెప్పాలి. అయితే ‘జైలర్’ మొదటి భాగంలో శివరాజ్ కుమార్ గెటప్.. బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) గెటప్ కి దగ్గర పోలికలు ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
దీంతో ‘జైలర్’ క్లైమాక్స్ లో శివరాజ్ కుమార్ సిగార్ చేత్తో పట్టుకుని నడుస్తూ విలన్ గ్యాంగ్ ముందుకు వచ్చి కూర్చునే సీన్ బాలయ్యకి పడి ఉంటే.. అది నెక్స్ట్ లెవెల్లో ఉండేది అని అభిమానులు ఆశపడ్డారు. ఇది దర్శకుడు నెల్సన్ వరకు వెళ్ళింది. దీంతో ఆయన ‘జైలర్’ లో బాలయ్య కోసం ఒక సీక్వెన్స్ రాసుకున్నట్టు చెప్పారు. కానీ అది కరెక్ట్ గా రాలేదు అని భావించి బాలయ్యని అప్రోచ్ అవ్వలేదు అని కూడా నెల్సన్ తెలిపారు.
అందుకే ‘జైలర్ 2’ కోసం ఆల్రెడీ దర్శకుడు నెల్సన్… బాలయ్యని కలవడం జరిగిందట. అయితే అది ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రట. దీంతో బాలకృష్ణ.. కొంచెం నిడివి కలిగిన పాత్ర ఉంటే చెప్పమని నెల్సన్ కి చెప్పారట. దానిని నెల్సన్ సీరియస్ గా తీసుకుని మళ్ళీ కథని పరిశీలించి.. బాలకృష్ణ కోసం 8 నిమిషాల పాత్రని డిజైన్ చేశారని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.