నందమూరి బాలకృష్ణ… ఎన్టీఆర్ నట వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టి .. తక్కువ టైంలోనే బోలెడంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అటు తర్వాత మాస్ సినిమాలు చేస్తూ స్టార్ హీరో అయ్యాడు. ఎన్టీఆర్ ఇమేజ్ ను మాత్రమే వాడుకోవాలి అని బాలయ్య అనుకోలేదు. అతని శైలికి తగ్గ కథలను ఎంపిక చేసుకున్నాడు. అందులో మాస్ అనేది బాలయ్యకి బాగా ప్లస్ అయ్యింది. అయితే బాలయ్యకి ఓ అలవాటు పెద్ద మైనస్ అనే చెప్పాలి.
అదేంటి అంటే.. బాలకృష్ణ ఏ దర్శకుడినైనా గుడ్డిగా నమ్మేస్తాడు. అందుకే బాలయ్య ఇమేజ్ ను వాడుకోవడం రాక కొంతమంది దర్శకులు .. ఆయనకు ఘోరమైన ఫ్లాప్ లు కూడా ఇచ్చారు. అయితే బాలయ్య ఇమేజ్ ను కరెక్ట్ గా వాడుకున్న వాళ్ళు ఇండస్ట్రీ హిట్ లు కొట్టి స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా.. బాలకృష్ణకి ఇంకో విషయం కూడా పెద్ద మైనస్ అయ్యింది. అదే రీమేక్ లకు దూరంగా ఉండడం. చిరు లా రీమేక్ లు చేయకపోవడం బాలయ్యను సెకండ్ ప్లేస్ కు పరిమితం చేసింది.
నిజానికి రజినీకాంత్ బాషా చిత్రాన్ని బాలయ్య రీమేక్ చేయాలి. దర్శకుడు సురేష్ కృష్ణ బాలయ్యను చాలా బ్రతిమాలాడు. రజినీకాంత్ ఇమేజ్ ను మూడు రెట్లు పెంచిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమా బాలయ్యతో రీమేక్ చేస్తే ఇంకా పెద్ద హిట్టు కొట్టోచ్చు అని దర్శకుడు సురేష్ కృష్ణ భావించారు. కానీ బాలయ్య మాత్రం రీమేక్ సినిమాల జోలికి పోను అని తప్పుకున్నాడు. తర్వాత చిరుతో రీమేక్ చేయాలని సురేష్ కృష్ణ భావించారు.
రజినీ స్నేహితుడు కాబట్టి అతనితో అడిగించారు. కానీ చిరు .. రీమేక్ వద్దు డబ్బింగ్ చేసేయమని సలహా ఇచ్చారు. చిరు చెప్పినట్టు చేయగా తెలుగులో కూడా ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో కూడా రజినీ మార్కెట్ భారీగా పెరిగింది. బాలయ్య మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత లక్ష్మీ నరసింహ చిత్రాన్ని బాలయ్య రీమేక్ చేయడం అందరికీ షాకిచ్చింది.