బాలయ్య (Balakrishna) బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ (Akhanda) సీక్వెల్ పై ఏ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు రామ్ ఆచంట (Ram Achanta) , గోపీచంద్ ఆచంట (Gopichand Achanta) ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల రూపాయలు అని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
ఒకవైపు బాలయ్య మరోవైపు బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. బాలయ్య ఈ సినిమా కొరకు ఏకంగా 34 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. బాబీ (Bobby) సినిమాకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్న ఆ మొత్తాన్ని 34 కోట్ల రూపాయలకు పెంచడం హాట్ టాపిక్ అవుతోంది.
వరుస హిట్ల వల్ల బాలయ్య మళ్లీ పారితోషికాన్ని పెంచేశారు. ఈ మధ్య కాలంలో బాలయ్య సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి. అఖండ2 సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. స్కంద సినిమా విషయంలో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని బోయపాటి శ్రీను అఖండ సీక్వెల్ విషయంలో జాగ్రత్త పడుతున్నారు.
Balakrishna remuneration calculations for Akhanda sequel
బాలయ్య బోయపాటి శ్రీను ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం మాత్రం పక్కా అని అభిమానులు ఫీలవుతున్నారు. అఖండ సీక్వెల్ కు కూడా థమన్ (Thaman) మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికవుతారేమో చూడాలి. బాలయ్య సినిమాలకు వరుసగా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తుండటం గమనార్హం. అఖండ2 సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రావాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందేనని తెలుస్తోంది. అఖండ2 మూవీ విషయంలో ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.