Balayya Babu: గట్టిగా మాట్లాడిన బాలయ్య.. వాళ్లు షాకయ్యారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ తను హీరోగా నటించిన అఖండ సినిమాను గతేడాది టికెట్ రేట్లు తక్కువగా ఉన్న సమయంలో విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. 75 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా బయ్యర్లకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో జై బాలయ్య అనే సినిమాలో నటిస్తున్నారు.

రాఖీ పండుగ రోజున బాలయ్య గోపీచంద్ మూవీ టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. గత కొన్నిరోజులుగా జరుగుతున్న షూటింగ్ ల బంద్ వల్ల బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ షూట్ కూడా ఆగిపోయింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను టర్కీలో షూట్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ల బంద్ వల్ల వాయిదా పడిందని తెలుస్తోంది.

బాలయ్య సెప్టెంబర్ నుంచి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో నటించాల్సి ఉంది. షూటింగ్ ల బంద్ వల్ల బాలయ్య ప్లాన్స్ అన్నీ మారిపోతుండటంతో వెంటనే షూటింగ్ ను మొదలుపెట్టాలని నిర్మాతలకు బాలయ్య గట్టిగా చెప్పారని సమాచారం అందుతోంది. నిర్మాతలు వీలైనంత త్వరగా బంద్ ముగిసేలా చూస్తామని బాలయ్యకు చెప్పారని బోగట్టా. షూటింగ్ ల బంద్ కు చెక్ పెట్టే దిశగా బాలయ్య అడుగులు వేయడంతో షూటింగ్ ల బంద్ ఎన్నో రోజులు కొనసాగదని తెలుస్తోంది.

టాలీవుడ్ హీరోలలో చాలామందికి షూటింగ్ ల బంద్ వల్ల నష్టం కలుగుతోంది. స్టార్ డైరెక్టర్లకు సైతం షూటింగ్ ల బంద్ ఇష్టం లేదనే సంగతి తెలిసిందే. బాలయ్య జై బాలయ్య సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ ఏడాదే జై బాలయ్య విడుదలయ్యే ఛాన్స్ ఉందని బోగట్టా. బాలయ్య బంద్ ను త్వరగా ముగించాలని చెప్పడంతో నిర్మాతలు షాక్ అయ్యారని బోగట్టా.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Share.