Balakrishna: ఆ విషయంలో అభ్యంతరం లేదంటున్న బాలయ్య!

సీనియర్ ఎన్టీఆర్ తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా బాలకృష్ణ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలోనే బాలకృష్ణ ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అరవై సంవత్సరాల వయస్సులో కూడా యాక్టివ్ గా ఉంటూ బాలకృష్ణ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బాలయ్య నటించిన అఖండ రిలీజ్ డేట్ కు సంబంధించి అతి త్వరలో క్లారిటీ రానుంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

అయితే తాజాగా జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో అనసూయ కోరిక మేరకు రోజా బాలకృష్ణకు ఫోన్ చేశారు. రోజా కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే బాలయ్య నమస్కారం అని చెప్పడంతో పాటు రోజా యోగక్షేమాలు కనుక్కున్నారు. రోజా ఏం చేస్తున్నారని అడగగా మన అఖండ షూటింగ్ లో ఉన్నానని బాలయ్య చెప్పుకొచ్చారు. మన కాంబినేషన్ లో సినిమా ఎప్పుడని ప్రేక్షకులు అడుగుతున్నారని రోజా ప్రశ్నించగా మన కాంబినేషన్ కొరకు అందరూ ఎదురుచూస్తున్నారని బాలయ్య పేర్కొన్నారు.

తాను జబర్దస్త్ షోకు జడ్జిగా వస్తానని ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని బాలయ్య తెలిపారు. ఆ తర్వాత ఆది, రాఘవ, అభి హాయ్ బ్రో అంటూ ఫోన్ లోనే బాలయ్య అందరినీ పలకరించారు. నా వయస్సు పదహారే అంటూ బాలయ్య ఫోన్ లో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. భవిష్యత్తులో బాలయ్య జబర్దస్త్ కు జడ్జిగా వస్తారేమో చూడాలి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Share.