మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ మూవీ నుంచి డైరక్టర్ తేజ బయటికి పోవడంతో ఆ చిత్రం అనేక అనుమానాలు నెలకొన్నాయి. డైరక్ట్ చేయడానికి ఎవరూ ముందుకురాకపోవడంతో ఆగిపోయిందని ప్రచారం సాగింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి అంత క్లియర్ అయిందని తెలిసింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావుకి దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు బాలయ్య అప్పగించారు. సినిమా కాస్టింగ్, స్క్రిప్ట్, కీరవాణితో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ వంటి వాటిని దర్శకేంద్రుడు దగ్గరుండి చేసుకోబోతున్నారు. చిత్రీకరణ మొత్తం బాలయ్య కనుసన్నలో సాగనుంది.
పూర్తి డైరక్షన్ బాలకృష్ణ చేయనున్నారు. ఇక నిర్మాత కూడా బాలయ్యే. మరి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా.. మూడు బాధ్యతలు కష్టమే కాబట్టి తన తోడల్లుడు ప్రసాద్ సాయం తీసుకోబోతున్నారు. అతనే ఖర్చులు, కీలక వ్యవహారాలు చూసుకుంటారు. ఇక రోజువారీ ప్రొడక్షన్, షూటింగ్ ప్లానింగ్ అంతా సాయి కొర్రపాటి చేతుల్లోకి వచ్చింది. ఇలా నందమూరి కుటుంబానికి చెందినవారు, ఆరాధించేవారు ఈ ప్రాజక్ట్ లో భాగమయ్యారు. చిన్న చిన్న పనులు కూడా ఆలస్యం జరగకుండా ఉండాలని పక్కా ప్లాన్ వేసినట్లు టాక్. అన్ని ఇబ్బందులు తొలిగిపోయాయి కాబట్టి ఈ మూవీ తొలి షెడ్యూలు మే ఫస్ట్ వీక్ నుంచి మొదలుకాబోతుంది.