దాదాపు మూడు దశాబ్దాలు నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలు అందించారు జయప్రకాశ్ రెడ్డి. విలన్ గా, కమెడియన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలను పోషించి మెప్పించడం జరిగింది. ఇక రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ గా జయప్రకాష్ రెడ్డి చాలా ఫేమస్. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన అనేక సినిమాలలో ఆయన ఫ్యాక్షనిస్ట్ రోల్ చేయడం జరిగింది. అలాంటి ఓ గొప్ప నటుడు నిన్న హఠాన్మరణం పొందారు. నిన్న ఉదయం జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో మరణించడం జరిగింది.
జయప్రకాశ్ రెడ్డి మరణం టాలీవుడ్ ప్రముఖులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకున్నారు. కాగా నందమూరి బాలకృష్ణ ఆయన కుటుంబం పట్ల తన ఔదార్యం చాటుకున్నారు. 10లక్షల రూపాయలు జయప్రకాశ్ రెడ్డి కుటుంబానికి బాలయ్య విరాళంగా ప్రకటించారు. దీనితో ఆ కుటుంబం పట్ల బాలయ్య నెరవేర్చిన బాధ్యతను అందరూ కొనియాడుతున్నారు. ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రాలతో బాలయ్య ఇండస్ట్రీ హిట్స్ అందుకోగా, ఫ్యాక్షనిస్ట్ గా జయప్రకాశ్ రెడ్డి నటించారు.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో పాటు టాలీవుడ్ రికార్డ్స్ చెరిపివేశాయి. సీమ సింహం, చెన్నకేశవ రెడ్డి చిత్రాలలో కూడా జయప్రకాశ్ రెడ్డి బాలయ్యకు విలన్ గా చేయడం జరిగింది.