Bandla Ganesh: బండ్ల గణేష్ హీరోగా ‘డేగల బాబ్జీ’.. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్ ..!
- September 17, 2021 / 05:42 PM ISTByFilmy Focus
ప్రముఖ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అయిన బండ్ల గణేష్ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రిషి అగస్త్య సమర్పణలో ‘యష్ రిషి ఫిలిమ్స్’ బ్యానర్ పై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే షూటింగ్ ప్రారంభమైంది.తమిళంలో హిట్ అయిన ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ అనే చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం. అక్కడ ఆర్. పార్తిబన్ చేసిన పాత్రని ఇక్కడ బండ్ల గణేష్ చేస్తున్నారు.
హీరో అనగానే డ్యాన్స్ లు, ఫైట్ లు మాత్రమే కాదు.. హీరోకి ఉన్న మెయిన్ రెస్పాన్సిబిలిటీ కథని నడిపించడం. బండ్ల గణేష్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో ఎన్నో వైవిధ్యమైన అంశాలు ఉన్నాయి. అందుకోసమే ఆ పాత్రకి తగినట్టు కొత్త మేకోవర్ ను ట్రై చేశారు బండ్ల గణేష్. ఇక ఈ చిత్రానికి ‘డేగల బాబ్జీ’ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు.

నుదిటి పై ఘాటు అలాగే రెడ్ టవల్ ను మొహానికి చుట్టుకుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేసే విధంగా ఈ పోస్టర్ ను డిజైన్ చేయించారు చిత్ర యూనిట్ సభ్యులు. బండ్ల గణేష్ ను ఇంత రఫ్ లుక్ లో చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు.ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ గా మారింది.
Thanks to my blockbuster director @harish2you for releasing for DEGALA BABJI .it’s a wonderful experience in my acting career.thanks to my director venkat chandra.🙏 pic.twitter.com/8icbcVXnzM
— BANDLA GANESH. (@ganeshbandla) September 17, 2021
నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!












