Bandla Ganesh, Pawan Kalyan: బండ్ల గణేష్ పవన్ ను ఉద్దేశించే మాట్లాడారా?
- December 27, 2023 / 04:23 PM ISTByFilmy Focus
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో బండ్ల గణేష్ ఒకరు. ఈయన కమెడియన్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం నిర్మాతగా పలువురు స్టార్ హీరోలతో సినిమా చేశారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి బండ్ల గణేష్ తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు ఒక ప్రశ్న ఎదురైనది.
మీ ప్రొఫైల్ ఫోటోలో బుక్ చదువుతూ కనిపించారు చాలా మంచిగా అనిపించింది అంటూ ఈయన పుస్తకాలు చదవడం గురించి ప్రశ్నలు వేశారు. ఇక ఈ ప్రశ్నలకు బండ్ల గణేష్ సమాధానం చెబుతూ తనకు పుస్తకాలు చదివే అలవాటు చాలా బాగా ఉందని తెలిపారు. ప్రతిరోజు నేను గంటకు పైగా పుస్తకాలు చదువుతానని తెలిపారు. ఇలా పుస్తకాలు చదువుతూ అందులో ఉన్నటువంటి మంచి పాయింట్స్ నేను అండర్లైన్ చేస్తూ ఉంటానని ఈ అలవాటు నాకు ఎప్పటినుంచో ఉందని ఈయన తెలియజేశారు.

అయితే నేను (Bandla Ganesh) రోజు ఒక గంటకు పైగా మాత్రమే పుస్తకం చదువుతానని అందరిలాగా రోజంతా పుస్తకాలు చదువుతున్నానని లక్షల సంఖ్యలో పుస్తకాలు చదివాను అంటూ గొప్పలు చెప్పుకోనని ఈయన మాట్లాడారు. ఈ విధంగా బండ్ల గణేష్ ప్రతిరోజు పుస్తకాలు చదువుతాను కానీ లక్షల్లో చదవలేదు అంటూ కామెంట్లు చేయడంతో చాలామంది ఈ వీడియో పై బండ్ల గణేష్ కచ్చితంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే మాట్లాడారని ఈయన పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కొందరు మాత్రం అసలు అక్కడ పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావనకు రాలేదు కదా అంటూ ఈ వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
https://twitter.com/i/status/1739672517202305515
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

















