కరోనా వైరస్ హీరోలు మరియు దర్శకనిర్మాతల టైం టేబుల్స్ మొత్తం నాశనం చేసింది. ముందుగా అనుకున్న ప్రణాళిక చెడిపోవడంతో అందరూ అయోమయానికి గురవుతున్నారు. కాగా కరోనా వైరస్ వలన ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్న చిత్రాలలో ఆర్ ఆర్ ఆర్ ఒకటి. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ఆలస్యం అయ్యేకొలది బడ్జెట్ భారం పెరిగిపోతుంది. విడుదల మరీ లేటయ్యేలా కనిపిస్తుంది. కరోనా ఆంక్షల మధ్య తక్కువ సిబ్బందితో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిర్వహణ కష్టం అని రాజమౌళి మొదలుపెడదాం అనుకోని కూడా ఆపేశారు.
కాగా ఈ సినిమా షెడ్యూల్స్ తారుమారు కావడం వలన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీ సైతం చిక్కుల్లో పడింది. దానికి కారణం ఆచార్య మూవీలో హీరో చరణ్ సైతం ఓ కీలక రోల్ చేస్తున్నారు. అరగంట నిడివి గల ఆ పాత్ర సినిమాకు చాలా కీలకం అని తెలుస్తుంది. ఐతే రామ్ చరణ్ మరియు రాజమౌళి ప్రధమ ప్రాధాన్యం ఆర్ ఆర్ ఆర్ పూర్తి చేయడమే. దీనితో చరణ్ ఆచార్య కోసం డేట్స్ కేటాయించలేని పరిస్థితి.
దీనితో కొరటాల ఆచార్య స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారట. కథలో కీలకంగా ఉన్న చరణ్ పాత్రను కేవలం గెస్ట్ రోల్ గా మార్చనున్నాడని సమాచారం. దీనితో ఆచార్య మూవీలో చిరు, మరియు చరణ్ కలిసి కొద్ధి నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. ఇది మెగా ఫ్యాన్స్ ని కొంచెం నిరాశ పరిచే అంశమే అని చెప్పాలి.