టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ రోజు రోజుకి జోరు కొనసాగిస్తూనే ఉంది. ‘మహానటి’ తో మొదలయ్యి ఇప్పుడు వస్తున్న ‘ఎన్టీఆర్ -బయోపిక్’ ‘యాత్ర’ ‘చంద్రోదయం’ ‘ఉద్యమ సింహం’ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇలా అరడజను బయోపిక్ ల హడావిడి నెలకొంది. తాజాగా ఇప్పుడు మరో బయోపిక్ కు సంబందించిన వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.
వివరాల్లోకి వెళితే 1970 లలో స్టూవర్ట్ పురం ప్రాంతానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు అనే దొంగ ఉండేవాడట. దొంగతనం చేసిన డబ్బంతా పేద ప్రజలకు పంచి పంచిపెట్టేవాడంట. అప్పట్లో జనాలు రాబిన్ హుడ్ గా పిలుచుకునే నాగేశ్వరరావు బయోపిక్ ను తెరకెక్కించబోతున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ బయోపిక్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయట. మొదట్లో దగ్గుబాటి రానా ఈ చిత్రం చేయబోతున్నాడంటూ వార్తలొచ్చాయి. అయితే తరువాత ఆ ప్రాజెక్ట్ కు సంబందించి ఎటువంటి పనులు మొదలు కాలేదు.
అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు మళ్ళీ మొదలు కాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో రానా చేయడం లేదు. ఈ చిత్రంకోసం బెల్లకొండ సాయి శ్రీనివాస్ ను హీరోగా అనుకుంటున్నారట. ఎమోషన్స్ తో పాటు అన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ ను మిక్స్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. రాజ్ తరుణ్ తో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాన్ని తెరకెక్కించి పర్వాలేదనిపించిన యంగ్ డైరెక్టర్ వంశీ కృష్ణ ఈ బయోపిక్ కు సంబందించిన ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడని తెలుస్తుంది. బెల్లకొండ శ్రీనివాస్ కు కూడా ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం బెల్లంకొండ తేజ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడట.