‘మగథీర’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రాంచరణ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఆరెంజ్’. అప్పటికి ‘బొమ్మరిల్లు’ ‘పరుగు’ వంటి రెండు సూపర్ హిట్లు అందుకున్న భాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇద్దరికీ హ్యాట్రిక్ మూవీగా రూపొందిన ‘ఆరెంజ్’ మూవీ ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మొదటి షోకే ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అని తేల్చేశారు ప్రేక్షకులు. మెగా అభిమానులకు కూడా ఈ సినిమా ఆ టైంలో ఏమాత్రం నచ్చలేదు.
అందుకు మెయిన్ రీజన్.. ‘మగధీర’ తో చరణ్ ఇండస్ట్రీ కొట్టి పెద్ద స్టార్ హీరో అయిపోవడం వల్ల..! ఆ టైంలో అతని నుండి పక్కా మాస్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తే క్లాస్ సినిమా అయిన ‘ఆరెంజ్’ బయటకు వచ్చింది.’మగథీర’ లో కత్తి తిప్పి శత్రు సంహారం చేసిన చరణ్.. ‘ఆరెంజ్’ లో అమ్మాయిల వెంట ప్రేమ అంటూ తిరగడం… జనాలకు నచ్చలేదు. ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే. అయితే 12 ఏళ్ళ తర్వాత ఆ మూవీ రీ రిలీజ్ అయితే పెద్ద ఎత్తున వెళ్లి చూశారు ప్రేక్షకులు.
అంతా బాగానే ఉంది కానీ ‘ఆరెంజ్’ (Orange) కి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అనే డౌట్ చాలా మందిలో ఉంది. ఇది ఓ రేంజ్ లవ్ స్టోరీ కాబట్టి ‘ఆరెంజ్’ అనే టైటిల్ పెట్టారు అంటూ అంతా అనుకున్నారు. కానీ దీనికి అసలు కారణం చెప్పుకొచ్చాడు దర్శకుడు భాస్కర్. అతను మాట్లాడుతూ.. “సినిమా థీమ్ ప్రకారం టైటిల్‌ను ఎంపిక చేశాను. ప్రేమ కొంతకాలం బాగుంటుంది.. తర్వాత తగ్గుతుంది. అప్పుడు మరొక వ్యక్తిని ప్రేమించాలని ‘ఆరెంజ్’ సినిమా చెబుతుంది.
ఒక వ్యక్తి పట్ల ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. రిలేషన్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దీన్నే సన్ రైజ్, సన్ సెట్‌తో పోల్చాం. ఈ రెండు సమయాల్లోనూ సూర్యూడు ఆరెంజ్ కలర్‌లో ఉంటాడు. సూర్యోదయం.. లవ్ స్టార్ట్ కావడాన్ని సూచిస్తుంది.. అందుకే ఆ సమయంలో అది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అలానే సూర్యాస్తమయం అనేది ప్రేమ ముగింపునకు కనిపించే సూచన. అందుకే ఈ చిత్రానికి ‘ఆరెంజ్’ అనే పేరు టైటిల్ పెట్టాం. టీమ్ అంతా ఈ టైటిల్ కే ఓటేశారు” అంటూ చెప్పుకొచ్చాడు భాస్కర్.