 
                                                        యూత్ స్టార్ నితిన్ హీరోగా రశ్మీఖ మందన హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘భీష్మ’. గత వారం ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం సూపర్ హాట్ టాక్ ను సొంతం చేసుకుని దూసుకుపోతుంది. వరుస ప్లాప్ లతో సతమత మవుతోన్న నితిన్ ఈ చిత్రంతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక మొదటి వారమే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం ఈరోజుతో విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది.

ఇక ఈ చిత్రం మొదటివారం కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
| నైజాం | 7.78 cr | 
| సీడెడ్ | 2.88 cr | 
| ఉత్తరాంధ్ర | 2.57 cr | 
| ఈస్ట్ | 1.48 cr | 
| వెస్ట్ | 1.09 cr | 
| కృష్ణా | 1.23 cr | 
| గుంటూరు | 1.53 cr | 
| నెల్లూరు | 0.61 cr | 
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.76 cr | 
| ఓవర్సీస్ | 2.77 cr | 
| వరల్డ్ వైడ్ టోటల్ | 23.70 cr | 
‘భీష్మ’ చిత్రానికి 22.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక మొదటి వారం పూర్తయ్యేసరికి 23.70 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రం కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు. రెండో వారంలో ఒక్క ‘హిట్’ మినహా పెద్ద క్రేజ్ ఉన్న సినిమాలు లేవు కాబట్టి ఈ వారం కూడా ఈ చిత్రం క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఆ అవకాశాన్ని ‘భీష్మ’ ఎంత వరకూ యూజ్ చేసుకుంటుందో చూడాలి.
Click Here To Read Bheeshma Movie Review
Most Recommended Video
‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!
