వరుసగా 3 డిజాస్టర్లు పడిన తర్వాత స్టార్ హీరోలే హిట్టు కొట్టడానికి కిందా మీదా పడతారు.. అలాంటిది మీడియం హీరో పై ప్రేక్షకులకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని చెప్పలేము. అలాంటిది నితిన్ ఆ సెంటిమెంట్లను బ్రేక్ చేస్తూ .. స్ట్రాంగ్ కం బ్యాక్ కు రెడీ అయ్యాడు. ఆయన హీరోగా నటించిన ‘భీష్మ’ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలయ్యింది. ‘ఛలో’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు నితిన్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి 78 శాతం రికవరీ సాధించేసింది.
ఇక ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
6.01 cr
సీడెడ్
2.10 cr
ఉత్తరాంధ్ర
1.78 cr
ఈస్ట్
1.21 cr
వెస్ట్
0.88 cr
కృష్ణా
0.97 cr
గుంటూరు
1.34 cr
నెల్లూరు
0.48 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.60 cr
ఓవర్సీస్
2.35 cr
వరల్డ్ వైడ్ టోటల్
18.72 cr
‘భీష్మ’ చిత్రానికి 22.7 కోట్ల బిజినెస్ జరిగింది. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 18.72 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 3.98 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈరోజు నుండీ ఈ చిత్రానికి అసలు పరీక్ష మొదలు కానుంది. వీక్ డేస్ లో ఈ చిత్రం పెర్ఫార్మ్ చేసే దానిని బట్టే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే 78 శాతం రికవరీ అయిపొయింది కాబట్టి.. ఓ మాదిరిగా కలెక్షన్లను రాబట్టిన బ్రేక్ ఈవెన్ సాధించడం ఈజీ అనే చెబుతున్నారు ట్రేడ్ పండితులు.