‘మగధీర’ (Magadheera) తర్వాత రాజమౌళి (S. S. Rajamouli) సరదాగా తీసిన సినిమా ‘మర్యాద రామన్న’ (Maryada Ramanna). సునీల్ (Sunil) ఈ చిత్రంలో హీరో. తక్కువ బడ్జెట్ తో తక్కువ టైంలో ఒక సినిమా తీయాలని రాజమౌళి చేసిన ప్రయత్నం ఇది. ఆయన ప్రయత్నానికి మంచి మార్కులు పడ్డాయి. సినిమా బాగా ఆడింది. సునీల్ మరో 4,5 ఏళ్ళ పాటు హీరోగా బిజీగా ఉండేలా చేసింది. దీని తర్వాత ‘ఈగ’ (Eega) చేశారు రాజమౌళి. తర్వాత ‘బాహుబలి’ (Baahubali) ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) వంటివి చేసి మరింత బిజీ అయిపోయారు. ఇక ఈ సినిమాల టైంలో రాజమౌళి ‘విక్రమార్కుడు 2’ (Vikramarkudu) తీయాలని ఉంది అంటూ పలుమార్లు చెప్పుకొచ్చారు.
Vikramarkudu & Maryada Ramanna
విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) అందుకే కథ కూడా రెడీ చేశారు. కానీ అప్పటికి రాజమౌళి మూడ్ మారిపోయింది. ‘విక్రమార్కుడు 2’ (Vikramarkudu) అంటూ తీస్తే అది విక్రమ్ రాథోడ్ పాత్ర లేకుండా తీయడం వేస్ట్. కాబట్టి.. ఆ పాత్ర ఉండేలా ప్రీక్వెల్ చేయాలి కానీ సీక్వెల్ కాదు అని రాజమౌళి మనసు మార్చుకున్నారు. దీంతో విజయేంద్ర ప్రసాద్ డిజైన్ చేసుకున్న కథని సంపత్ నంది వంటి అప్ కమింగ్ స్టార్ డైరెక్టర్స్ కి ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
కానీ ఆ కథకి ‘విక్రమార్కుడు 2’ టైటిల్ పెట్టుకోకూడదు, దానికి సీక్వెల్ అని ప్రచారం చేసుకోకూడదు అనే కండిషన్ పెట్టి.. ఆ కథని ఇచ్చేశారు అనే టాక్ నడిచింది. ‘విక్రమార్కుడు’ (Vikramarkudu) బాలీవుడ్లో కూడా రీమేక్ అయ్యి హిట్ అయ్యింది. దానికి సీక్వెల్ చేయాలని అక్కడి ఫిలిం మేకర్స్ కూడా ప్రయత్నించారు. కానీ రాజమౌళి తీసిన తర్వాత చూద్దాంలే అని వాళ్ళు కూడా మనసు మార్చుకున్నారు. అయితే ‘మర్యాదరామన్న’ కి సీక్వెల్ తీయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ‘మర్యాదరామన్న’ అక్కడ ‘సన్ ఆఫ్ సర్దార్’ గా రీమేక్ అయ్యి హిట్ కొట్టింది.
దానికి సీక్వెల్ తీయాలని మన రాజమౌళి అనుకోలేదు. ఎందుకంటే ‘మర్యాదరామన్న’ లో ఇంటి బ్యాక్ డ్రాప్ తో కథని డిజైన్ చేసుకున్నారు. హీరో ఆ ఇంట్లో ఉన్నంత వరకు సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ అతను బయటకు వచ్చేశాక ఆసక్తి ఏమీ ఉండదు. అందుకే ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని రాజమౌళి ప్రయత్నించింది లేదు. కానీ బాలీవుడ్లో అజయ్ దేవగన్ తో (Ajay Devgn) ఆ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్. మరి వాళ్ళు ఎలా తీస్తారో చూడాలి.