మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటే దర్శకుడు బోయపాటి శ్రీనునే గుర్తుకొస్తుంటారు. ఆయన రవితేజ హీరోగా నటించిన ‘భద్ర’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన నుండీ వచ్చిన సినిమాలు అన్నీ దాదాపు విజయాలు సాధించినవే అన్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాకి చెందిన ఈయన కెరీర్ ప్రారంభంలో తన సోదరుడి ఫోటో స్టూడియో చూసుకునేవారు. అటు తర్వాత దిల్ రాజు అవకాశం ఇవ్వడంతో దర్శకుడిగా మారారు. ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను కూడా ఒకరు. అంతేకాదు ఈయనకి హిట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువే..!
బోయపాటి శ్రీను సినిమాలు చాలా క్వాలిటీగా ఉంటాయి. అలాగే ఎక్కువమంది సీనియర్ ఆర్టిస్ట్ లు కనిపిస్తూ ఫ్రేమ్ అంతా సందడిగా ఉండేలా చూసుకుంటారు. పలానా సీన్ లో ఫైట్ పడాలి అంటే పడుతుంది.ఇంటర్వెల్ సీన్ రాజమౌళి స్టైల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఉంటుంది. నిన్నటితో అంటే మే 12 తో బోయపాటి శ్రీను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్ళు పూర్తయ్యింది.ఆయన మొదటి సినిమా ‘భద్ర’ 2005 సంవత్సరంలో మే 12న విడుదలైంది.ఆయన ఇప్పటివరకు 9 సినిమాలు తెరకెక్కించారు. అందులో 2 తప్ప అన్నీ హిట్టు సినిమాలే. ఆ 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించినవే.ముఖ్యంగా బోయపాటి శ్రీను సినిమాలు మాస్ సెంటర్స్ చాలా బాగా కలెక్ట్ చేస్తుంటాయి. లాంగ్ రన్ కొనసాగుతాయి కూడా. బోయపాటి తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతెంత కలెక్ట్ చేశాయో ఓ లుక్కేద్దాం రండి :
1) భద్ర :
రవితేజ, మీరా జాస్మిన్ జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.14.7 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.
2) తులసి :
వెంకటేష్, నయనతార జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.18.43 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.
3) సింహా :
నందమూరి బాలకృష్ణ హీరోగా నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.31.64 కోట్ల షేర్ ను బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
4) దమ్ము :
ఎన్టీఆర్ హీరోగా త్రిష, కార్తీక హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.35 కోట్ల షేర్ ను రాబట్టి ఎబౌవ్ యావరేజ్ గా నిలిచింది.
5) లెజెండ్ :
నందమూరి బాలకృష్ణ హీరోగా రాధికా ఆప్టే,సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 40.39 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.
6) సరైనోడు :
అల్లు అర్జున్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.73.87 కోట్లు షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
7) జయ జానకి నాయక :
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.21.73 కోట్ల షేర్ ను రాబట్టి.. కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది.
8) వినయ విధేయ రామ :
రాంచరణ్ హీరోగా కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.63 కోట్ల షేర్ ను రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.
9) అఖండ :
బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.73.29 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
బోయపాటి శ్రీను తర్వాతి చిత్రం రామ్ తో చేయబోతున్నాడు. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్.. అంతేకాకుండా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ఈ మూవీ కూడా భారీ కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయి.