అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3. ఈ సినిమా మే 27వ తేదీ విడుదల అయి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతి ఒక్కరి నటన ఎంతో అద్భుతం అని చెప్పాలి. ఇకపోతే ఇందులో అలీ, రాజేంద్ర ప్రసాద్, ప్రదీప్, రఘు బాబు వంటి సీనియర్ నటులు కూడా ఎంతో అద్భుతంగా నటించారు.
ఇక ఈ సినిమా థియేటర్లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం విజయోత్సవ కార్యక్రమాలను కూడా ఘనంగా ఏర్పాటు చేశారు. ఇకపోతే తాజాగా ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం చిత్ర బృందంతో కలిసి చిట్ చాట్ చేశారు. ఇందులో అనిల్ రావిపూడి, ఆలీ, వెంకటేష్, వరుణ్ తేజ్ పాల్గొన్నారు.ఇక ఈ సినిమాలో వెంకటేష్ వరుణ్ తేజ్ నటనపై బ్రహ్మానందం ప్రశంసలు కురిపిస్తూ అద్భుతంగా నటించారని కొనియాడారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్ గతంలో తాను పలు సినిమాలలో చూశానని వెంకటేష్ గురించి మాట్లాడారు
ఇకపోతే వరుణ్ తేజ్ హీరో అయినప్పటికీ ఆయన చేత కూడా నత్తి మాట్లాడిస్తూ మంచి కామెడీ క్రియేట్ చేశారని బ్రహ్మానందం పేర్కొన్నారు. ఆలీ రాజేంద్ర ప్రసాద్ రఘు బాబు వీరందరి నటన అమోఘం అని బ్రహ్మానందం ఈ సందర్భంగా వెల్లడించారు. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నంత మంది కమెడియన్స్ మరే ఇతర చిత్ర పరిశ్రమలో కూడా లేరని బ్రహ్మానందం గుర్తు చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక చిన్న విన్నపం చేశారు.
తెలుగు సినిమాలలో కమెడియన్స్ లేకపోయినా పర్వాలేదు.. కామెడీని మాత్రం తప్పకుండా పెట్టండి అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకు ఈయన విన్నపం చేశారు. ఇక పోతే ఈ సినిమాలో నటించే అవకాశాన్ని అనిల్ రావిపూడి ముందుగా బ్రహ్మానందానికి కూడా కల్పించారు.అయితే అప్పుడు కరోనా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించలేక పోయానని ఈ సందర్భంగా బ్రహ్మానందం ఎఫ్3 సినిమా గురించి వెల్లడించారు.