పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ బ్రో. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టి. జి. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. జూలై 28 న అంటే మరి కొన్ని గంటల్లో బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.
వారి టాక్ ప్రకారం ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ పోర్షన్ చాలా స్లోగా ఉందని. అయితే పవన్ కళ్యాణ్ టైంగా ఎంట్రీ ఇచ్చాక అందరిలో ఎనర్జీ వస్తుందని. ఇంటర్వల్ పోర్షన్ ఓకె అనిపిస్తుంది అని .. ఇక సెకండ్ హాఫ్ స్లోగా స్టార్ట్ అయ్యింది అని.. ఒకే లైన్ పై కథ వెళ్లడంతో ప్రేక్షకులకు బోర్ ఫీలింగ్ కలుగుతుంది అని వారు అంటున్నారు.
పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు బాగుంటాయట. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ బాగున్నాయి అని అంటున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ట్ వర్క్ బాగుందట. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి :
#Bro Overall the movie had a few good moments but falters overall!
Had an interesting storyline with few entertaining scenes/many PK fan moments. However, the rest lacks connect with weak writing and emotions that don’t work. Catered for fans only.
#BroTheAvathar#BroTheAvathar Just finished watching #usa premier show-
Good one, bore kottaledu, #PawanKalyan styling/looks bavunnai, #Tej acting bavundi, end point bavundi, knchm fans stuff ekuvyndi but that’s okay, BGM kuda bavundi..
@thondankani congratulations for the good work sir.. loved your direction the timings between the characters and utilizing every character very well shows the direct point of view and production values.#BroTheAvathar