నిన్న మినిస్టర్ కొండా సురేఖ (Konda Surekha) గాంధీ భవన్ లో హీరోయిన్ సమంత (Samantha) , నాగార్జున (Nagarjuna), నాగచైతన్యల (Naga Chaitanya) పేర్లు వాడి చాలా హేయమైన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి మీద నిలిచి “సినిమా ఇండస్ట్రీ చూస్తూ ఊరుకోదు” అని నినదించారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ సదరు కామెంట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పినప్పటికీ.. కనీసం క్షమాపణ కోరకపోవడం గమనార్హం.
Konda Surekha
నిన్న పేరు పేరుగా అసహ్యంగా మాట్లాడిన ఆమె ఇవాళ మాత్రం “ఆ కుటుంబం” అంటూ ప్రస్తావించడం ఆమె స్థాయిని మరింత తగ్గించింది. సురేఖ (Konda Surekha) కంటే నీచంగా ఆమె వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మల్లు రవి అయితే ఏకంగా అమల క్షమాపణలు కోరాలని అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది రాజకీయ నాయకులుగా వారు ఎంత దిగజారిపోయారు అనేందుకు నిదర్శనంగా నిలుస్తుంది. కొండా సురేఖ పేరుపేరున క్షమాపణలు చెప్పాలి, ముఖ్యంగా సమంతకు ఆమె లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలి.
అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయమై వెంటనే స్పందించాలి. అంతే కానీ.. సినిమావాళ్లే కదా సైలెంట్ అయిపోతారు అనుకుంటే మాత్రం చారిత్రక తప్పిదం చేసినవాళ్లవుతారు. ఇక సమంతకు సపోర్ట్ గా సినిమా ఇండస్ట్రీ మొత్తం నిలవడం మంచి పరిణామం.
చిరంజీవి (Chiranjeevi) , వెంకటేష్ (Venkatesh Daggubati) , ఎన్టీఆర్ (Jr NTR), అల్లు అర్జున్ (Allu Arjun) , నాని (Nani), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi), సుధీర్ బాబు (Sudheer Babu) , కోన వెంకట్, వరుణ్ తేజ్ (Varun Tej) వంటి వారందరూ బేషరతుగా సురేఖ (Konda Surekha) క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం హర్షణీయం. ఈ విషయమై పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , మహేష్ బాబు(Mahesh Babu) , రామ్ చరణ్ (Ram Charan) లు కూడా స్పందిస్తే.. విషయం తీవ్రతరమయ్యి.. కొండా సురేఖ మరియు కాంగ్రెస్ నాయకులు దెబ్బకి దిగొస్తారు.