మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తదుపరి చిత్రం కోసం ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందనున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. టెక్నికల్ టీమ్ దగ్గర నుంచి కథ పరంగా కూడా అన్ని పనులు జోరుగా జరుగుతున్నాయి. నటీనటుల ఎంపికలో హీరో చిరంజీవి తర్వాత ఇప్పుడు ప్రధానంగా హీరోయిన్ ఎంపికపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఒక క్రేజీ హీరోయిన్ కోసం సెర్చింగ్ మొదలైనట్టు సమాచారం.
ప్రారంభంలో ఈ చిత్రానికి నయనతారను (Nayanthara) హీరోయిన్‌గా తీసుకురావాలని ప్లాన్ చేశారు. గతంలో ‘గాడ్ ఫాదర్’ (Godfather) సినిమాలో నయన్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నా, అక్కడ ఆమెకు చిన్న పాత్ర మాత్రమే వచ్చింది. ఈసారి పూర్తి స్థాయి జోడీగా నటించాలని అనిల్ రావిపూడి ఆలోచించినట్లు సమాచారం. అయితే పారితోషికం విషయంలో నయనతార భారీగా 18 కోట్లు డిమాండ్ చేయడంతో ఆమెను తీసుకునే ఆలోచనను డ్రాప్ చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కొత్త హీరోయిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. చిరంజీవి స్థాయికి తగ్గ, నటనలోనూ, గ్లామర్‌లోనూ ఆకట్టుకునే హీరోయిన్ అవసరమవుతుంది. ఇప్పటికే త్రిష (Trisha), కాజల్ (Kajal Aggarwal), తమన్నా(Tamannaah Bhatia) వంటి టాప్ హీరోయిన్స్‌తో చిరు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ వారిని తీసుకోవడం బోరింగ్ అనిపించొచ్చు. అందుకే కొత్త ఫ్రెష్ ఫేస్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. సౌత్ ఇండస్ట్రీ నుంచి యువ నటి తీసుకుంటారా, నార్త్ ఇండస్ట్రీకి వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాకు కావాల్సిన హీరోయిన్ కామెడీ టైమింగ్‌లో నైపుణ్యం ఉండాలని అనిల్ రావిపూడి టీమ్ భావిస్తోంది. ఎందుకంటే సినిమా స్వరూపం పూర్తిగా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. కథలో ఫ్రెష్ కాస్టింగ్ అవసరమై, ప్రేక్షకులకు నూతన అనుభూతిని ఇవ్వాలనుకోవడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఇదే. ఫైనల్‌గా, చిరు 157 కోసం ఫుల్ స్వింగ్‌లో హీరోయిన్ సెర్చ్ కొనసాగుతుండగా, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.