Chiranjeevi, Mahesh Babu: అబ్బో ‘పుష్ప’ ఈవెంట్ పెద్దగానే ప్లాన్ చేసారుగా..!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్ధల నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు సినిమా పై భారీ అంచనాలు నమోదయ్యేలా చేసాయి. డిసెంబర్ 17న పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేసింది చిత్ర యూనిట్.

ట్రైలర్ కోసం టీజర్ ను కూడా రిలీజ్ చేసి హైప్ పెంచారు. ఈరోజు సాయంత్రం ట్రైలర్ ను కూడా 5భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీగా ప్లాన్ చేసింది ‘పుష్ప’ యూనిట్. ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా చిరంజీవి, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు హాజరుకాబోతున్నారట. ఈ ఇద్దరు హీరోలతో ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వారి విన్నపం మేరకే ఈ వేడుకకి వారు గెస్ట్ లు గా హాజరుకాబోతున్నట్టు టాక్.

ఏమైనా పెద్ద సినిమాలని కాపాడుకోవడానికి ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలంతా ఏకం అవ్వడానికి సిద్ధమైనట్టు కూడా స్పష్టమవుతుంది. ఇక ‘పుష్ప’ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్, ధనుంజయ,అనసూయ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తుండగా సమంత ఐటెం సాంగ్ లో నర్తించనుంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Share.