మహేష్ బాబు తండ్రి, సీనియర్ మోస్ట్ స్టార్ హీరో అయిన కృష్ణ గారు నవంబర్ 15 న మరణించడం జరిగింది. గుండె నొప్పి తో గచ్చిబౌలి హాస్పిటల్లో జాయిన్ అయిన ఆయన తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయారు. ఆయన గురించి ఇప్పటి జనరేషన్ కు చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన మరణించిన నేపథ్యంలో కృష్ణ గారి గురించి బోలెడన్ని విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. అవి చూసి ఇప్పటి తరం ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో కృష్ణ గారి పేరు సువర్ణ అక్షరాలతో రాయతగినది. టాలీవుడ్లో ఈయనొక ట్రెండ్ సెట్టర్. రామారావు, నాగేశ్వరరావు వంటి స్టార్ హీరోలు నంబర్ రేస్ లో కొనసాగుతున్నప్పుడు కృష్ణ గారు ఎంట్రీ ఇచ్చి… కొంతకాలానికే మాస్ ఆడియన్స్ లో, ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిరంజీవి పాంప్లేట్ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అప్పట్లో కృష్ణ గారికి 2500 అభిమాన సంఘాలు ఉండేవి. ఇప్పటికీ అన్ని అభిమాన సంఘాలు ఉన్న హీరో లేడు అంటే అతిశయోక్తి కాదు. 2008 లో ఈ అభిమాన సంఘాలు అన్నీ కలిసిపోయాయి. మెగాస్టార్ చిరంజీవికి కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పటికీ ఆయన కూడా కృష్ణ గారి అభిమాని అని ఎక్కువ మందికి తెలిసి ఉండదు. ఆయన మాత్రమే కాదు నాగ బాబు కూడా కృష్ణ గారికి వీరాభిమాని.అప్పట్లో పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో అభిమాన సంఘం ఉండేది.
దానికి చిరంజీవి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. తోడు దొంగలు సినిమా ప్రమోషన్ల టైంలో ఈ పాం ప్లేట్ ను విడుదల చేసారు.ఈ మూవీలో కృష్ణతో కలిసి చిరంజీవి కూడా నటించారు. కృష్ణ గారు అంటే చిరుకి ఇప్పటికీ చాలా అభిమానం. కృష్ణ గారికి గౌరవపూర్వకంగా దక్కాల్సిన అవార్డులు చాలా ఉన్నాయని, అవి ఆయనకు దక్కలేదని చిరు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.