మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరోసారి కథల ఎంపికలో తన ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నారు. వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) వంటి భారీ హిట్ తర్వాత చిరు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల ఫామ్ లో ఉన్న కొందరు దర్శకులు కథలు వినిపించినా, వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు నాని (Nani) ‘దసరా’ (Dasara) చిత్రంతో ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో (Srikanth Odela) చిరు సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Chiranjeevi
శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ కోసం మాస్ మసాలా కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ (C. Aswani Dutt) నిర్మించనున్నారని టాక్. దసరా సినిమాలో చిరు పాటలను, మెగాస్టార్‌కు సంబంధించిన కొన్ని పాయింట్స్ హైలెట్ చేయడం ద్వారా తన మెగాభిమానాన్ని చాటుకున్న శ్రీకాంత్, ఇప్పుడు చిరంజీవితో పని చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది.
ఎందుకంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర (Vishwambhara) మూవీ పనులతో బిజీగా ఉండగా, శ్రీకాంత్ ఓదెల తన తదుపరి చిత్రం ‘ది ప్యారడైజ్’ పనుల్లో నిమగ్నమయ్యారు. నానితో వైవిధ్యమైన మాస్ లుక్‌లో రూపొందిస్తున్న ఈ చిత్రంతో పాటు చిరు కోసం కూడా అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్‌తో కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కథలో భారీ ఎలివేషన్లు, పవర్‌ఫుల్ సీన్లు ఉండనున్నాయని టాక్. చిరు ఈ కథపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సమాచారం.
ఇక మెగా ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కోసం మెగాభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇక మెగాస్టార్, శ్రీకాంత్ కాంబినేషన్ మూవీ 2025లో చివరలో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనుకున్నట్లు జరిగితే 2026లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. మరోవైపు మెగాస్టార్ లిస్టులో అనిల్ రావిపూడి (Anil Ravipudi) , వెంకీ కుడుముల (Venky Kudumula) లాంటి దర్శకులు కూడా ఉన్నారు.