ఆకాష్ పూరి హీరోగా గెహనా సిప్పీ హీరోయిన్ గా ‘దళం’ ‘జార్జ్ రెడ్డి’ వంటి చిత్రాలను అందించిన జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చోర్ బజార్’. ‘యూవీ క్రియేషన్స్’ సమర్పణలో ‘ఐవీ క్రియేషన్స్’ పతాకంపై వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడం తో మొదటి నుండి సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. ప్రీ రిలీజ్ వేడుకలో బండ్ల గణేష్ స్పీచ్ కూడా ఈ చిత్రం పబ్లిసిటీకి కారణం అయ్యింది అనే చెప్పాలి.
జూన్ 24న విడుదల అయిన ఈ చిత్రానికి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది.దీంతో మొదటి వీకెండ్ ‘చోర్ బజార్’ కి జస్ట్ యావరేజ్ అన్నట్టు ఓపెనింగ్స్ వచ్చాయి.వీక్ డేస్ లో ఈ మూవీ దాదాపు స్లీపేసినట్టే కనిపిస్తుంది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.50 cr
సీడెడ్
0.23 cr
ఉత్తరాంధ్ర
0.26 cr
ఈస్ట్
0.10 cr
వెస్ట్
0.06 cr
గుంటూరు
0.18 cr
కృష్ణా
0.10 cr
నెల్లూరు
0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
1.48 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.07 cr
ఓవర్సీస్
0.05 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
1.60 cr
‘చోర్ బజార్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.3.76 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.1.6 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.2.4 కోట్ల షేర్ ని, బిజినెస్ పై అయితే రూ.2.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
టార్గెట్ పెద్దది కాబట్టి బ్రేక్ ఈవెన్ కష్టంగానే కనిపిస్తుంది. వీకెండ్ లో పెర్ఫార్మ్ చేసినట్టు..వీక్ డేస్ లో కూడా కలెక్ట్ చేసి ఉండి ఉంటే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉండేది.ఇప్పుడైతే కష్టంగానే కనిపిస్తుంది. జూలై 1 నుండి గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ మూవీ వస్తుంది. ఆ మూవీ ఉండగా అయితే ఈ మూవీ నిలబడడం చాలా కష్టం.