డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లైగర్. పాన్ ఇండియా స్థాయిలో విజయ్ దేవరకొండను హీరోగా పరిచయం చేస్తూ చేసిన ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదలయి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూటర్లు పూరి జగన్నాథ్ పై ఒత్తిడి తెచ్చి తమ డబ్బు తమకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
ఇలా ఈ సినిమా విడుదలైన మరుక్షణం నుంచి పూరి జగన్నాథ్ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించింది పేరుకి పూరి జగన్నాథ్ చార్మి అయినప్పటికీ,తెర వెనుక మాత్రం ఈ సినిమా విషయంలో కొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నారనీ కాంగ్రెస్ నేత బక్కా జాడ్సన్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే లైగర్ సినిమా నిర్మాణ విషయంలో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని ఈయన ఆరోపణలు చేయడమే కాకుండా ఈడీకి ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే గురువారం ఈడీ అధికారులు నిర్మాతలు పూరీ జగన్నాథ్ చార్మిని పిలిచి సుమారు 13 గంటల పాటు విచారణ చేపట్టినప్పటికీ వీరిద్దరూ సరైన ఆధారాలను సమర్పించలేదు. దీంతో ఈ సినిమా విషయంలో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని కాంగ్రెస్ నేత బక్కా జాడ్సన్ వెల్లడించారు. కల్వకుంట్ల కవిత వద్ద ఉన్నటువంటి బ్లాక్ మనీ వైట్ గా మార్చడం కోసమే ఆమె ఈ సినిమాని నిర్మించారని ఈయన ఆరోపణలు చేశారు. పూరి జగన్నాథ్ వంటి డైరెక్టర్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు అంటే అందుకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్నటువంటి
హీరోని తీసుకుంటారు కానీ ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఏ మాత్రం క్రేజ్ లేనటువంటి విజయ్ దేవరకొండతో అలాంటి భారీ బడ్జెట్ సినిమా చేయరని ఈయన ఆరోపించారు.విజయ్ దేవరకొండ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్లు రావు అనే విషయం పూరీ జగన్నాథ్ కు తెలియదా అంటూ ఈయన ప్రశ్నించారు. లైగర్ సినిమా వెనుక పెద్ద రాజకీయ కోణం ఉందని ఈ సినిమా ద్వారా కల్వకుంట కవిత బ్లాక్ మనీని వైట్ గా మార్చడం కోసమే ఈ సినిమా చేశారనీ ఈయన మరోసారి ఆరోపణలు చేశారు.