మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలలో భాగంగా భీమవరంలో ఆయన విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ముఖ్యఅతిథిగా సినీ పరిశ్రమ నుంచి హాజరయ్యారు. ఇలా సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు.ఈ కార్యక్రమానికి ఆయనని పిలవకుండా మెగాస్టార్ చిరంజీవి మాత్రమే పిలవడంతో సీపీఐ నారాయణ మెగాస్టార్ ని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాజకీయాలలో రంగులు మార్చే చిరంజీవికి స్టేజ్ పై ప్లేస్ తగదని చిల్లర బేరగాడు అంటూ ఆయన గురించి ఆరోపణలు చేశారు. ఈ విధంగా మెగాస్టార్ గురించి నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మెగాస్టా ర్ గురించి చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో నారాయణ వెనక్కి తగ్గారు.
మెగా అభిమానులు మాత్రమే కాకుండా కాపు సంఘాల నాయకుల నుంచి సోషల్ మీడియా వేదికగా నారాయణకు పెద్ద ఎత్తున వార్నింగ్ రావడమే కాకుండా ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వరకు ఈ వివాదం వెళ్ళింది. ఇకపోతే మెగా బ్రదర్ నాగబాబు సైతం ఈ విషయం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఇలా ప్రతి ఒక్కరూ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మీడియా సమావేశంలో మాట్లాడిన నారాయణ మెగా అభిమానులకు మెగాస్టార్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఉద్దేశిస్తూ తాను మాట్లాడిన మాటలను అలాగే తాను ఉపయోగించిన పదాన్ని భాషా దోషంగా పరిగినిస్తున్నానని, మెగాస్టార్ గురించి తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని తెలిపారు. మెగా అభిమానులు కాపునాడు మహానుభావులు ఈ విషయం ఇంతటితో మర్చిపోండి అంటూ ఈయన తను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తూ క్షమాపణలు కోరారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.