రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్, తారక్ ఇతర రాష్ట్రాల అభిమానులకు దగ్గరవడంతో పాటు సెలబ్రిటీలకు సైతం ఫేవరెట్ స్టార్స్ గా మారిపోయారు. టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్నిరోజుల క్రితం షమీ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరో క్రికెటర్ శ్రీశాంత్ జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలని ఉందంటూ తన మనస్సులోని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఒక ఈవెంట్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను కలవడంతో పాటు ఆయనతో మాట్లాడానని శ్రీశాంత్ చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడుతూ యాక్టింగ్ అద్భుతంగా ఉంటుందని డ్యాన్స్ బాగా చేస్తారని చెప్పానని శ్రీశాంత్ కామెంట్లు చేశారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని శ్రీశాంత్ అన్నారు. రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ శ్రీశాంత్ కాంబినేషన్ లో ఒక సినిమాను ఆశించవచ్చని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తే మోటివ్ గా అనిపించిందని శ్రీశాంత్ వెల్లడించారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర ఏకంగా ఆరు నెలలు వాయిదా పడటం అభిమానులను ఒకింత నిరాశకు గురి చేస్తోంది. ఈ సినిమా అప్ డేట్స్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దేవర టీం స్పందిస్తే మాత్రమే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశాలు అయితే ఉంటాయి. అక్టోబర్ 10వ తేదీన దేవర రిలీజ్ కానుంది.
దసరా పండుగ కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా పండుగ సెలవులను క్యాష్ చేసుకుని ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.శ్రీశాంత్ కామెంట్లు విన్న నెటిజన్లు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) క్రేజ్ వేరే లెవెల్ అని కామెంట్లు చేస్తున్నారు.