నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ ‘భగవంత్ కేసరి’.. వంటి హిట్ సినిమాలతో సూపర్ ఫామ్లో ఉన్నారు. తాజాగా ‘డాకు మహారాజ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి బాబీ దర్శకుడు.ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు వంటి వాటికి పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అయితే రిలీజ్ ట్రైలర్ అంచనాలు ఏర్పడేలా చేసింది. మొదటి రోజు ‘డాకు మహారాజ్’ కి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి.
Daaku Maharaaj Collections
2 వ రోజు కూడా కుమ్మేసింది అని చెప్పాలి.ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 రోజుల్లో ఈ సినిమా రూ.40.93 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.42.57 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.