వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు నితిన్ (Nithiin). ఒక హిట్ ఇస్తే తర్వాత అతని ఖాతాలో 3 ప్లాపులు పడుతున్నాయి. ‘భీష్మ’ (Bheeshma) తర్వాత నితిన్ చేసిన ‘చెక్’ (Check) ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) ‘ఎక్స్ట్రా'(Extra Ordinary Man) వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ‘రంగ్ దే’ (Rang De) పర్వాలేదు అనిపించింది. ‘మాస్ట్రో’ (Maestro) ఓటీటీకి వెళ్లి సేఫ్ అయ్యింది. సో నితిన్ కి ఇప్పుడు హిట్ అవసరం. అందుకే తనకు ‘భీష్మ’ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుములతో (Venky Kudumula) ‘రాబిన్ హుడ్’ (Robinhood) అనే సినిమా చేశాడు.
వాస్తవానికి డిసెంబర్లోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల డిలే అయ్యింది. మొత్తానికి మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీలీల (Sreeleela) ఇందులో హీరోయిన్. ‘రాబిన్ హుడ్’ కి ఉన్న మరో అట్రాక్షన్ ఏంటంటే.. ఈ సినిమాలో ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ వార్నర్ కూడా నటించడం. అవును ‘రాబిన్ హుడ్’ లో అతను 5 నిమిషాలు కనిపిస్తాడట. 4 రోజుల పాటు అతను షూటింగ్లో పాల్గొన్నాడు. సినిమాలో అతి కీలకమైన పాత్ర అని మేకర్స్ అంటున్నారు.
అందులో నిజమెంత అనేది మనకు రిలీజ్ రోజునే తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ‘రాబిన్ హుడ్’ కోసం వార్నర్ కి ఎంత ఇచ్చి ఉంటారు? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘రాబిన్ హుడ్’ కోసం వార్నర్ కి రూ.2.5 కోట్లు ఇచ్చారని తెలుస్తుంది. నిజానికి అతను రోజుకు కోటి వరకు డిమాండ్ చేశాడట. ఫైనల్ గా రూ. 2.5 కోట్లకి అంటే రోజుకు రూ.60 లక్షల వరకు చెల్లించేలా కన్విన్స్ చేసారని వినికిడి.