‘దసరా’ తో (Dasara) నాని (Nani) వంద కోట్ల క్లబ్లో చేరాడు. అటు తర్వాత చేసిన ‘హాయ్ నాన్న’ (Hi Nanna) కూడా బాగానే ఆడింది. క్లాస్ సినిమా అయినప్పటికీ అది కూడా రూ.60 కోట్ల పైనే కలెక్ట్ చేసింది. అటు తర్వాత వచ్చిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) మళ్ళీ రూ.100 కోట్లు కొట్టింది. చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ‘సరిపోదా శనివారం’ రూ.100 కొట్టడం.. చెప్పుకోదగ్గ విషయమే. సో నాని ఇప్పుడు తాను కలిగి ఉన్న మార్కెట్ ను కాపాడుకోవాలని భావిస్తున్నాడు.
నానికి స్టార్ ఇమేజ్ ఉన్నా.. కొత్త దర్శకులు, అంచనాలు లేని దర్శకులతోనే సినిమాలు చేస్తూ ఉంటాడు. అందువల్ల సినిమా సక్సెస్లో ఎక్కువ క్రెడిట్ అతనికే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు నాని ‘హిట్ 3’ (HIT3) చేస్తున్నాడు. ‘సైందవ్’ (Saindhav)vతో శైలేష్ (Sailesh Kolanu) ఓ ప్లాప్ ఇచ్చాడు. కాబట్టి అతనిపై ఇప్పుడు అంచనాలు లేవు. ‘హిట్ 3’ అయినా ఎక్కువ క్రెడిట్ నానికే పోతుంది.
ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘హిట్ 3’ తర్వాత నాని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో (Srikanth Odela) ‘ది పారడైజ్’ (The Paradise) అనే సినిమా చేయాల్సి ఉంది. ఈ మధ్యనే గ్లింప్స్ కూడా వదిలారు. అది పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు లేవట. మరోవైపు ‘ఈ సినిమా ఆగిపోయింది’ అనే చర్చ కూడా నడుస్తోంది. కానీ వాటిలో నిజం లేదు అనేది ఇన్సైడ్ టాక్. ఇటీవల ‘కోర్ట్’ ని (Court) గట్టిగా ప్రమోట్ చేశాడు నాని.
అలాగే ‘హిట్ 3’ షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు అతనికి కొంచెం గ్యాప్ దొరకడంతో చిన్న టూర్ కి వెళ్లి రావాలని భావిస్తున్నాడు. ఆ తర్వాత ‘హిట్ 3’ ప్రమోషన్స్ లో పాల్గొంటాడు. ఇక పారడైజ్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా కోరాడట నాని. అందుకే ఇప్పట్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడం కష్టం అని తెలుస్తుంది.