రామ్ చరణ్, రాణా వంటి సీనియర్ హీరోలందరూ బాలీవుడ్ లో ప్రయత్నించి వర్కవుట్ అవ్వక మళ్ళీ టాలీవుడ్ లోనే స్థిరపడినట్లు.. “నోటా” ఫ్లాప్ అనంతరం విజయ్ దేవరకొండ కూడా మళ్ళీ తమిళ తెరవైపు కన్నెత్తి చూడడేమో అనుకున్నారందరూ. కట్ చేస్తే.. మనోడు భేతాళుడిగా సక్సెస్ కొట్టేవరకూ తమిళ ఇండస్ట్రీని వదిలేలా కనిపించడం లేదు. పనిలోపనిగా ఈసారి ఏకంగా మలయాళ, కన్నడ ఇండస్ట్రీలోను పాదం మోపనున్నాడు. బాబు సక్సెస్ అవుతాడా లేదా అనే విషయం పక్కన పెడితే ముందుగా మనోడి ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రమైన “డియర్ కామ్రేడ్” చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు విజయ్.
తెలుగు, తమిళ భాషల్లో ఎలాగూ విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది, ఇక కన్నడలో రష్మికకు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎలాగూ సినిమాలో కొందరు మలయాళ నటులు కూడా ఉన్నారు కాబట్టి మలయాళంలోనూ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. మరి విజయ్ ప్లాన్ సక్సెస్ అయ్యి నాలుగు ఇండస్ట్రీల్లో ఒకేసారి సూపర్ హిట్ కొట్టి అక్కడ తన ఉనికిని ఘనంగా చాటుకుంటాడో లేక నోటా తరహా రిలజ్ట్ నే మళ్ళీ ఎదుర్కొంటాడో చూడాలి.