ఫలితం తేడా కొట్టిన సినిమాలకే సక్సస్ ప్రెస్ మీట్‌లు, సక్సెస్ మీట్‌లు, థ్యాంక్స్ ప్రెస్ మీట్, థ్యాంక్స్ మీట్‌లు చేస్తుంటారు మన టాలీవుడ్‌లో కొంతమంది. అలాంటిది డివైడ్ టాక్ వచ్చిన సినిమాకు చేయకుండా ఉంటారా? కచ్చితంగా చేస్తారు? ఇప్పుడు సమస్య చేస్తారా? చేయరా? అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఇక్కడ ప్రశ్న ఆ ఈవెంట్ ఎక్కడ చేస్తారు అని. ఇంత చర్చ జరుగుతున్న ఆ సినిమా ‘దేవర’ (Devara) అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా.
Devara
‘దేవర’ సినిమా ఇటీవల విడుదలై డివైడ్ టాక్‌లో నడుస్తోంది. అయితే సినిమా టీమ్ మాత్రం మా సినిమా రూ. 200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది అని చెబుతోంది. ఆ లెక్క వాళ్లు చూసుకుంటారు. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ ఎక్కడ? ఎప్పుడు? అనేదే ఇక్కడ ప్రశ్న. బియాండ్ ఫెస్ట్‌కి వెళ్లిన తారక్ స్వదేశానికి రాగానే ఈవెంట్ పెట్టే ప్లాన్‌లో ఉన్నారు. అయితే అది ఎక్కడ? అనేదే ఇక్కడ ప్రశ్న.
ఎందుకంటే మొన్నీమధ్య అనుకున్న ప్రీ రిలీజ్ ఈవెంటే తేడా కొట్టేసింది. పాసులు, నిర్వహణ తదితర అంశాల్లో తేడా కొట్టేసి మొత్తంగా ఒక్క స్పీచ్ కూడా లేకుండానే రద్దు అయిపోయింది. దానికితోడు ఇప్పటికిప్పుడు హైదరాబాద్‌లో ఈవెంట్లు పెద్ద ఎత్తున చేసే వేదికలు లేవు. ఉన్నవాటికి పర్మిషన్లు రావడం లేదు. దీంతో అవుటాఫ్ హైదరాబాద్ చేయాలి. అది తెలంగాణలో ఇతర ప్రాంతాల్లోనా? లేక ఆంధ్రప్రదేశ్‌లోనా అనేది తెలియాల్సి ఉంది.
మామూలుగా అయితే ఏపీలో ఈ సినిమా ఈవెంట్‌కి పర్మిషన్ రావడం పెద్ద విషయం కాదు. ఈ సినిమా ప్రదర్శన హక్కులను పూర్తి స్థాయిలో తీసుకొని నిర్మాత అయిపోయారు నాగవంశీ (Suryadevara Naga Vamsi). అంటే త్రివిక్రమ్ (Trivikram) కూడా నిర్మాత అన్నట్లే లెక్క. ఈ లెక్కన ఆయన ఏపీ ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకురావడం పెద్ద కష్టం కాదు. అన్నట్లు టికెట్ ధరల విషయంలో పర్మిషన్ కూడా అలానే వచ్చింది అని ఓ టాక్ కూడా ఉంది.