ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు అంటూ వార్తలు రావడం.. సెలబ్రిటీలు, ప్రముఖలు కూడా సంతాప సందేశాలు పంపించేశారు. అయితే ఆయన ఇంకా మన మధ్యలోనే ఉన్నారు, ఇలా ఆయన ఇక లేరు అని రాయడం సరికాదు అంటూ ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇదంతా గత రెండు రోజులుగా జరిగింది. అయితే ఇప్పుడు ధర్మేంద్రను ఇంటికి తీసుకొచ్చేశారట. శ్వాస సంబంధిత సమస్యతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ధర్మేంద్ర ఇటీవల చేరిన సంగతి తెలిసిందే.
Govinda
ధర్మేంద్రను ఇంటికి తరలించాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నట్టు ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ ప్రతీత్ సందానీ మీడియాకు తెలిపారు. ఈ రోజు ఉదయం 7:30 గంటలకు ధర్మేంద్రను డిశ్చార్జ్ చేశాం. ఇంటి వద్దే ఆయనకు చికిత్స అందించాలని కుటుంబం నిర్ణయించుకుంది అని ప్రతీత్ నందానీ తెలిపారు. 89 ఏళ్ల ధరేంద్ర.. డిసెంబరు 8న 90వ వసంతంలోకి అడుగుపెట్టనుండటం గమనార్హం. ఇదిలా ఉండగా మరో బాలీవుడ్ నటుడు ఆసుపత్రిలో చేరారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా మంగళవారం అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరారు. జూహులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు నటుడి స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ మీడియాకు తెలిపారు. 61 ఏళ్ల గోవిందా మంగళవారం మిడ్‌నైట్ స్పృహ కోల్పోయారట. ఆస్పత్రిలో చేర్పించక ముందు ఫోన్‌లో వైద్యులతో ఆయన మాట్లాడారని.. ఆ తర్వాత అపస్మారక స్థితిలో వెళ్లడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారట. ప్రస్తుతం గోవిందా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం.
గతేడాది కూడా గోవిందా ఇలానే ఆసుపత్రిలో చేరారు. మోకాలిలోకి బుల్లెట్ చొచ్చుకుపోవడంతో హాస్పిటల్‌లో చేర్చారు. సర్జరీ చేసి బుల్లెట్ తొలిగించారు. బీరువా నుండి తుపాకి జారి కిందపడటంతో పేలి తూటా కాలిలోకి దూసుకుపోయిందని గోవిందా వివరణ ఇచ్చారు. అయితే అప్పటి నుండి ఆయన వైవాహిక జీవితం మీద ఏదో పుకారు వస్తూనే ఉంది. భార్య సునీతతో ఆయన కలసి లేరు అంటూ వార్తలొస్తున్నాయి. ఆమె కూడా అప్పుడప్పుడు గోవిందా మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు.