‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం నాడు అనగా జనవరి 06 న ఆంధ్రప్రదేశ్లోని, రాజమండ్రిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.హీరో రాంచరణ్ (Ram Charan) తో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఈ ఈవెంట్ కి హాజరుకావడంతో అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. చరణ్ స్పీచ్ కంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ ఈ ఈవెంట్లో బాగా హైలెట్ అయ్యింది.
Dil Raju
పవన్ అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా కోరుకున్నదే అది. అయితే పవన్ కళ్యాణ్ స్పీచ్లో అభిమానులు క్షేమంగా ఇంటికి వెళ్లాలని.. అప్పుడే తనకు ఆనందంగా ఉంటుందని.. కోరారు. అయినప్పటికీ ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ ఈవెంట్ నుండి బైక్ పై తిరిగి వెళ్తూ ఐచర్ వ్యాన్ ను ఢీ కొట్టారు. అందువల్ల వాళ్ళు అక్కడికక్కడే మరణించడం జరిగింది.
ఈ ఘటనపై దిల్ రాజు స్పందించారు. ఇది చాలా విషాదకరం అని ఆయన అన్నారు. అంతా బాగానే జరిగింది అని తిరిగి వస్తున్న టైంలో ఇలా జరగడం చాలా బాధిస్తుంది అని తెలిపారు దిల్ రాజు (Dil Raju). ఈ క్రమంలో ఆ ఇద్దరు అభిమానుల కుటుంబాలకి నా తరఫున చెరో రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.
దిల్ రాజులానే పవన్ కళ్యాణ్, చరణ్..లు కూడా ఆ కుటుంబాలకి అండగా నిలబడాలని మెగా అభిమానులు కోరుతున్నారు. అయితే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అలాగే వైసీపీ శ్రేణులు.. ‘పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేయాలంటూ’ నెగిటివ్ గా స్పందిస్తున్నారు.సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న ఈ కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి.
ఆ ఇద్దరు చనిపోయినట్టు నాకు తెలియదు – దిల్ రాజు
గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు యువకుల మృతి పై స్పందించిన నిర్మాత దిల్ రాజు
ఇలాంటివి జరుగుతాయి అనే పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దు అన్నారు.. నేను చరణ్ కావాలని రిక్వెస్ట్ చేశాము