ఒక సినిమా రిజల్ట్ ఊహించని విధంగా కొందరి ఆలోచనలను మార్చేస్తాయి. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)విషయంలో ఇదే జరిగింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో నిలవకపోవడంతో దిల్ రాజు (Dil Raju) పేరు మళ్లీ విమర్శల జాడలోకి వచ్చిపోయింది. కానీ నిర్మాతగా ఆయన అనుభవం, వ్యూహాలు మరోసారి తెరమీదకు వస్తున్నాయి. ఎందుకంటే ఫెయిల్యూర్‌కి భయపడకుండా మళ్లీ మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్లతో బౌన్స్ బ్యాక్ ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి దిల్ రాజు లైన్‌అప్ చూస్తే చాలా వ్యూహాత్మకంగా అనిపిస్తోంది.
ప్రశాంత్ నీల్‌తో (Prashanth Neel) కలిసి ఒక బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి గ్రౌండ్ వర్క్ మొదలైందని సమాచారం. ఇది మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ యాక్షన్ ఫీస్ట్ గా ఉండనుంది. కేజీఎఫ్ (KGF), సలార్ (Salaar) తరహాలో విస్తృత బిజినెస్ క్రాస్ చెయ్యాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ డిజైన్ అవుతోంది. దీంతో పాటు, ‘మార్కో’ (Marco) దర్శకుడు హనీఫ్ (Haneef Adeni) తో మరో మల్టీస్టారర్ కూడా దిల్ రాజు బ్యానర్‌లో రూపుదిద్దుకుంటుందని సమాచారం. ఇక దాదాపు నాలుగేళ్ల క్రితమే సిద్ధం చేసిన ‘జటాయు’ కథను మళ్లీ ట్రాక్‌లో పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
అప్పట్లో స్క్రిప్ట్ పూర్తయ్యి ఉన్నా, ప్రాజెక్ట్ ఆగిపోవడం జరిగిందట. ఇప్పుడు కథను మళ్ళీ కొత్తగా మార్చి మరింత గ్రాండ్‌గా, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కించాలనే ప్లాన్‌తో దిల్ రాజు ముందుకు వెళ్తున్నారు. ఇక ప్రభాస్ ను (Prabhas) హీరోగా సెలెక్ట్ చేయాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఓ విజువల్ వండర్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అలాగే అల్లు అర్జున్‌తో (Allu Arjun) కూడా దిల్ రాజు ఒక భారీ సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. బన్నీ ఇప్పటికే రాజుగారికి ఓకే చెప్పినట్టు టాక్.
ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కూడా లైన్‌లోకి వస్తే, పాన్ ఇండియా స్థాయిలో మంచి బిజినెస్ చాన్స్ ఉంది. దిల్ రాజు ఈసారి తీసుకుంటున్న జాగ్రత్తలు, తాను ఎంపిక చేస్తున్న డైరెక్టర్లు, కథలు అన్నీ చూసుకుంటే – బిజినెస్ పరంగా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తున్నట్టు అర్థమవుతుంది. ‘గేమ్ ఛేంజర్’ ఫెయిల్యూర్‌ను మరిపించేలా దిల్ రాజు కొత్త విజన్‌తో ముందుకెళ్తున్నారు. స్టార్డమ్, మాస్ ఎలిమెంట్స్, కంటెంట్ కలబోతతో భారీ కమర్షియల్ సినిమాలను రూపొందించే లక్ష్యంతో ఫోకస్ చేశారు. ఈ లైన్‌అప్ అనుకున్నట్లు సెట్టయితే, మళ్లీ దిల్ రాజు తన మార్క్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం.