టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన్ దిల్ రాజుకు ఇతర నిర్మాతలతో పోలిస్తే ఎక్కువ సక్సెస్ రేట్ ను కలిగి ఉన్నారు. ఈ నిర్మాత బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. ఒకవైపు నిర్మాతగా, మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గా రెండు పడవల ప్రయాణం చేస్తున్న దిల్ రాజుకు రెండు రంగాల్లో మంచి లాభాలు వస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ నేను డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను కొనసాగించి ఉంటే ఇంత లాంగ్ జర్నీ ఉండేది కాదని ఆయన తెలిపారు.
2017కు ముందు నేను వరుస విజయాలు సాధించానని అయితే డిస్ట్రిబ్యూటర్ గా రెండు భయంకరమైన డిజాస్టర్లు వచ్చాయని ఆయన కామెంట్లు చేశారు. స్పైడర్, అజ్ఞాతవాసి సినిమాలు 25 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చాయని దిల్ రాజు తెలిపారు. నేను డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే ఉండి ఉంటే ఆ రెండు సినిమాలతో షట్ డౌట్ అయ్యేవాడినని ఆయన చెప్పుకొచ్చారు. బాహుబలి సినిమాతో పది కోట్ల రూపాయల లాభం వచ్చిందని అదే హైయెస్ట్ లాభం అని దిల్ రాజు పేర్కొన్నారు.
నష్టాలు వచ్చిన సమయంలో నిర్మాతగా విజయాలు ఉండటం నాకు ప్లస్ అయిందని ఆయన వెల్లడించారు. నేను రిస్క్ తీసుకుంటున్నానని దిల్ రాజు పేర్కొన్నారు. ఇండస్ట్రీలో 90 శాతం సినిమాలు ఫ్లాప్ అని ఆయన వెల్లడించారు. దసరా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నామని ఆయన అన్నారు. దిల్ రాజు చెప్పింది నిజనమేనని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
తన ప్రతిభతో (Dilraju) దిల్ రాజు ఈ రేంజ్ లో సక్సెస్ అయ్యారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. దిల్ రాజు నిర్మాతగా తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంటున్నారు.