యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ ‘దిల్ రుబా’ (Dilruba) . రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon), కాథీ డేవిసన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని విశ్వ కరుణ్ (Vishwa Karun) డైరెక్ట్ చేశాడు. ‘శివమ్ సెల్యులాయిడ్స్’, ‘సారెగమ’ ‘ఏ యూడ్లీ’ సంస్థలపై రవి, జోజో జోస్(Jojo Jose), రాకేష్ రెడ్డి (Rakesh Reddy) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో ముందు రోజు నుండే ప్రీమియర్స్ వేస్తున్నారు.
టీజర్, ట్రైలర్స్, పాటలు.. వంటివి ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. హీరో కిరణ్ అబ్బవరం కూడా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇక ఆల్రెడీ ఈ సినిమాని టాలీవుడ్లో ఉన్న కొంతమంది ప్రముఖులకి చూపించడం జరిగింది. సినిమా చూసిన తర్వాత వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేయడం జరిగిందట. వారి టాక్ ప్రకారం అయితే.. ఈ సినిమా రన్ టైం 2 గంటల 32 నిమిషాల నిడివి కలిగి ఉందట. కోపిష్టి అయినటువంటి హీరో తన పర్సనల్ లైఫ్లో ఒక సమస్య వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటాడు.
ఇలాంటి టైంలో తన గురించి అంతా తెలిసిన వ్యక్తికి చెప్పుకుని, సాయం అడగాలని భావిస్తాడు. ఈ క్రమంలో అతను ఎక్స్- గర్ల్ ఫ్రెండ్ అయితేనే కరెక్ట్ అని డిసైడ్ అయ్యి.. ఆమెకు తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పుకుని ఆమె సాయం కోరతాడు. ఇక ఆ ఎక్స్ – గర్ల్ ఫ్రెండ్ కూడా తన మాజీ ప్రియుడి శ్రేయస్సు కోసం సాయం చేయడానికి ముందుకు వస్తుంది. అసలు హీరో ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? చివరికి అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సాయంతో అతను గట్టెక్కడా?
ఈ క్రమంలో వీరికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అసలు గతంలో వీళ్ళు ఎందుకు విడిపోయారు? అనే సస్పెన్స్ తో ఈ సినిమా సాగుతుందట. కిరణ్ అబ్బవరం ఇందులో స్టైలిష్ గా కనిపించాడట. ఇందులో చాలా ఎనర్జిటిక్ గా కూడా కనిపించినట్టు చెబుతున్నారు. హీరోయిన్లు కూడా బాగా చేశారట. ఫైట్స్ కూడా బాగున్నాయట. జాన్ విజయ్ రోల్ కూడా గుర్తుండిపోయేలా ఉంటుందని సినిమా చూసిన వారు చెబుతున్నారు. మరి ప్రీమియర్ షోలతో ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.