పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈ గురువారం అంటే జూలై 24న విడుదల కానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు. ట్రైలర్ అదిరిపోయింది. సినిమాపై అంచనాలు పెంచింది. ‘హరిహర వీరమల్లు’ పై మొదటి నుండి కొంత నెగిటివిటీ ఏర్పడింది. బిజినెస్ కూడా సరిగ్గా జరగకపోవడం నిర్మాత ఏ.ఎం.రత్నం కూడా టెన్షన్ పడ్డారు.
అయితే ట్రైలర్ తో ఆ నెగిటివిటీ అంతా పోయింది అనే చెప్పాలి. ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి.. ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి మాట్లాడటం అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఇక తాజాగా శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత ఏ.ఎం.రత్నం చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. నిర్మాత ఏ.ఎం.రత్నం మాట్లాడుతూ… “నేను ఎన్నో సినిమాలు నిర్మించాను. కానీ ‘హరిహర వీరమల్లు’ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కాబట్టి.
‘ఖుషి’ లాంటి సినిమా కాకుండా ఒక హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ తో కూడిన పాన్ ఇండియా సినిమాని నిర్మించడం కూడా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని తెలియజేస్తున్నాను. సినిమా అన్నాక తీసిన తర్వాత.. ఎంతో కొంత మెసేజ్ చెప్పాలని నాకు ఎప్పుడూ ఉంటుంది. ‘హరిహర వీరమల్లు’ సినిమా అందరినీ ఆలోచింపజేసేలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు” ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీయం అయ్యాక రిలీజవుతున్న మొదటి సినిమా కాబట్టి హరిహర వీరమల్లు నాకు చాలా స్పెషల్..
పవన్ కళ్యాణ్ విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు..#HariHaraVeeraMallu #PawanKalyan #NidhhiAgerwal #AMRathnam #JyothiKrishna pic.twitter.com/3tKB6xuawn
— Filmy Focus (@FilmyFocus) July 21, 2025