Director Bobby: ‘డాకు’ విషయంలో చాందినీకి అన్యాయం జరిగిందా..?
- January 23, 2025 / 11:20 AM ISTByPhani Kumar
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా బాబీ కొల్లి (K. S. Ravindra) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj). సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్ గా నటించగా శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Rama Srinath), ఊర్వశి రౌతేలా(Urvashi Rautela), చాందినీ చౌదరి (Chandini Chowdary)..లు కీలకా పాత్రలు పోషించారు. వీరిలో చాందినీ చౌదరి పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్ర అని అంతా పెదవి విరిచారు. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నప్పటికీ..
Director Bobby:

ఇలాంటి సినిమా ఎలా ఓకే చేసింది అంటూ చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. క్లైమాక్స్ లో బాలయ్యని కోమాలో నుండి కోలుకునేలా చేయడానికి మాత్రమే ఈమెను తీసుకున్నారేమో అంటూ కొంతమంది కామెడీ కూడా చేశారు. అయితే ‘డాకు మహారాజ్’ లో చాందినీ సీన్లు డిలీట్ అయ్యాయట. స్వయంగా దర్శకుడు బాబీ (Bobby) ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. నిన్న అనంతపూర్లో జరిగిన ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్లో బాబీ మాట్లాడుతూ..

“హీరోయిన్ చాందినీ చౌదరికి సారి అండ్ థాంక్స్ కూడా చెప్పుకోవాలి. ఆమె ‘కలర్ ఫోటో’ (Colour Photo) వంటి అద్భుతమైన సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ మా సినిమాకు ఓకే చెప్పింది. కానీ ఆమెకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్లో రన్ టైం ఎక్కువ అవుతుంది అని తీసేశాం. ఆమె పెళ్లి ఎపిసోడ్ ఉంటుంది. దాన్ని తొలగించడం జరిగింది. ఈ విషయం చాందినీకి చెప్పాను (Bobby).. అందుకు ఆమె ‘ఇలాంటి గొప్ప సినిమాలో నటించే ఛాన్స్ నాకు వచ్చింది. అందుకు థాంక్స్’ అని చెప్పింది” అంటూ తెలియజేశాడు.

















