ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కేవీ ఆనంద్ (54) కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కేవీ ఆనంద్ పూర్తి పేరు కరిమనళ్ వెంకటేశన్ ఆనంద్. కేవీ ఆనంద్ ఫోటో జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. 1994లో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. ఆయన తొలి చిత్రం ‘తెన్ మావిన్ కొంబాత్’. ఇందులో మోహన్‌లాల్ ప్రధాన పాత్రధారి. ఈ సినిమాకు ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్‌గా ‘ఒకే ఒక్కడు’, ‘ప్రేమదేశం’, ‘బాయ్స్’, ‘శివాజీ’ లాంటి విజయవంతమైన సినిమాలు తీశారు.
2005లో కేవీ ఆనంద్ దర్శకుడిగ మారారు. సూర్యతో ‘వీడొక్కడే’, ‘బ్రదర్స్’ తెరెకెక్కించారు. జీవాతో ‘రంగం’, ధనుష్‌తో ‘అనేకుడు’ లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. సూర్య, మోహన్ లాల్‌తో రూపొందించిన ‘బందోబస్త్’ కేవీ ఆనంద్ ఆఖరి చిత్రం. ఆయన మృతిపట్ల తమిళ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.