హరీష్ శంకర్ (Harish Shankar) .. రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఫ్యాక్టరీ నుండి వచ్చిన డైరెక్టర్. ‘మిరపకాయ్’ (Mirapakay) తో హిట్టు కొట్టి.. ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) ఛాన్స్ పట్టి.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా ఎదిగాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తుంది అంటే.. సహజంగానే అంచనాలు భారీగా ఏర్పడతాయి. ట్రేడ్లో కూడా హరీష్ శంకర్ సినిమాలకి డిమాండ్ ఎక్కువ. అయితే ప్రమోషన్స్ టైంలో హరీష్ శంకర్ ఇచ్చే స్పీచ్ లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. ‘అతను మనసులో ఏదీ దాచుకునే టైపు కాదు.
Harish Shankar
ఏది ఉన్నా ఓపెన్ అయిపోతాడు. తనను ఇబ్బంది పెట్టిన మాటకైనా, ట్వీటుకైనా ఘాటుగా సమాధానం చెబుతాడు. అతని సినిమాల్లోని హీరోల పాత్రల్లానే అతను కోపంలో పలికే మాటలు కూడా చాలా పవర్ఫుల్ గా అనిపిస్తాయి. ఇక మరో 2 రోజుల్లో ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు హరీష్ శంకర్. ‘గద్దలకొండ గణేష్’ (Gaddalakonda Ganesh) తర్వాత హరీష్ శంకర్ నుండి వస్తున్న మూవీ ఇది. అంటే 5 ఏళ్ల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా అనమాట. సో ఈ సినిమా హిట్ అవ్వడం అతని కెరీర్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి.
అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ని చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేశాడు హరీష్. ఇదిలా ఉండగా.. నిన్న ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో అతను స్పీచ్ ఇస్తున్నప్పుడు కోపంగా ఓ వ్యక్తి వంక చూసి.. ‘ఒరేయ్ ఎక్కువగా అరుస్తున్నావ్.. నిన్ను ట్విట్టర్లో బ్లాక్ చేసేస్తాను. నీ ఐడియా కూడా నాకు తెలుసు’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. హరీష్ పలికిన ఈ డైలాగ్ ఇప్పుడు ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతుంది. వాస్తవానికి హరీష్ శంకర్ ట్విట్టర్లో బ్లాక్ చేసిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.