అమృతం సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి నటుడు హర్షవర్ధన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా నటుడిగా మాత్రమే కాకుండా మంచి రచయితగా కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు పొందారు. ఇలా రచయితగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన తాజాగా సుధీర్ బాబు హీరోగా మామ మశ్చెంద్ర సినిమా ద్వారా దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత హర్షవర్ధన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన దాదాపు 5 పదుల వయసులోకి అడుగుపెడుతున్న ఇప్పటికీ కూడా ఒంటరిగానే ఉన్నారు. ఇప్పటికి పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు అయితే ఎందుకు ఇన్ని రోజులు పెళ్లి గురించి ఆలోచించలేదు అనే విషయాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా పెళ్లి గురించి హర్షవర్ధన్ మాట్లాడుతూ నా లైఫ్ స్టైల్ కి పెళ్లి ఏమాత్రం పడదని తెలిపారు. తాను ఎంతసేపు ఉన్న అందరితో సరదాగా మాట్లాడుతాను, ఉన్నంత సేపువారితో బాగా మాట్లాడుతాను అలాగని పార్టీలకు ఫంక్షన్లకు వెళ్లడం నాకు ఇష్టం ఉండదు ఒంటరిగా ఉండటానికి తనకు ఇష్టమని ఈయన తెలియచేశారు. వారికి నా సమయం ఇవ్వడం వారికి నచ్చినట్టు ఉండటం నాకు అసలు పడదు నేను సరిగా నా బాధ్యతలని చూసుకొనని తెలిపారు .
ఇలా స్వేచ్ఛగా బ్రతికే నాకు పెళ్లి చేసుకుంటే ఇలా ఉండటానికి అసలు కుదరదు భార్య పిల్లలు బాధ్యత చూసుకోవాలి కుటుంబ బాధ్యతలను చూసుకోవాలి వారికి నచ్చిన విధంగానే ఉండాలి. ఇక పెళ్లి అనేది జీవితంలో తోడు అంటారు కానీ అదొక ఇన్సూరెన్స్ పాలసీ బిజినెస్ డీల్ అంటూ ఈయన మాట్లాడారు. మనకు చేతకాకపోతే వారితో సేవలు చేయించుకోవడం కోసమే పెళ్లి చేసుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనకు కూడా గతంలో ఎన్నో రిలేషన్స్ ఉన్నాయి పెళ్లి కోసం అమ్మాయిల వెంట కూడా పడ్డాను ఒక అమ్మాయి అయితే బ్రేకప్ చెప్పిన తర్వాత కూడా తనకు మెసేజ్ చేసేదని తెలిపారు. నేను పెళ్లి చేసుకోకపోయినా నాకు మంచి చెడులు చూసుకోవడానికి నా స్నేహితులు ఉన్నారని ఇక జీవితమంతా ఇలాగే సింగిల్ గా ఆడుతూ పాడుతూ బ్రతికేస్తాను అంటూ (Harsha Vardhan) హర్షవర్ధన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.