కరుణాకరణ్ (A. Karunakaran) నిన్నటితరం స్టార్ డైరెక్టర్. ‘తొలిప్రేమ’ (Tholi Prema) తో ఓ క్లాసిక్ హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత ‘యువకుడు’ (Yuvakudu) ‘వాసు’ (Vasu) ‘బాలు’ (Balu) వంటి మంచి సినిమాలు కూడా అందించాడు. ‘హ్యాపీ’ ‘ఎందుకంటే ప్రేమంట’ (Endukante… Premanta!) సినిమాలు నిరాశపరిచినా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ ‘డార్లింగ్’ (Darling) సినిమాలతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అయితే ఆ తర్వాత చేసిన ‘చిన్నదాన నీకోసం’ బిలో యావరేజ్ మూవీగా నిలిచింది. కానీ వెంటనే ‘తేజ్ ఐ లవ్ యు’ (Tej I Love You) అనే డిజాస్టర్ మూవీ ఇచ్చి రిస్కులో పడిపోయాడు.
తర్వాత అతన్ని చాలా వరకు జనాలు మర్చిపోయారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత కరుణాకరన్ తిరిగి మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అయ్యాడు. ఈ టైంలో అతను రీ ఎంట్రీ ఇస్తానంటే నిర్మాతలు నమ్ముతారా. కానీ మన దిల్ రాజు (Dil Raju) నమ్మి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అవును దిల్ రాజుని ఇటీవల కలిసి కరుణాకరణ్ ఓ కథ వినిపించాడట. అది దిల్ రాజుకి నచ్చింది.
కానీ దీనికి ముందు దిల్ రాజు ఆల్రెడీ సెలెక్ట్ చేసిన ఓ కథని ఆశిష్ తో డైరెక్ట్ చేయాలని.. కరుణాకరణ్ ని కోరినట్టు తెలుస్తోంది. కరుణాకరణ్ బ్రాండ్ ఆశిష్ కి కలిసొస్తుంది. మిగిలింది మొత్తం దిల్ రాజు దగ్గరుండి చూసుకుంటారు కాబట్టి.. కరుణా కరణ్ కి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఈ ప్రాజెక్టు అనుకున్నట్టు వర్కౌట్ అయితే.. వెంటనే కరుణా కరణ్ కి దిల్ రాజు ఇంకో ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉందట.