Director KK : దర్శకుడు కేకే (కిరణ్ కుమార్) ఆకస్మికంగా మృతి చెందినట్టు ఒక వార్త ఆన్లైన్లో తెగ వైరల్ గా మారింది. అయితే దీంట్లో నిజమెంత..?సినిమా రంగంలో తనదైన ప్రయాణాన్ని సాగించిన కేకే, దర్శకుడిగానే కాకుండా అసిస్టెంట్ దర్శకుడు, నటుడిగా కూడా పరిచయం ఉన్న వ్యక్తి.
కేకే తన సినీ కెరీర్‌ను అసిస్టెంట్ దర్శకుడిగా ప్రారంభించారు. లెజెండరీ దర్శకుడు మణిరత్నం వద్ద పనిచేసే అవకాశం దక్కించుకొని, ఆయన తెరకెక్కించిన పలు ప్రతిష్టాత్మక చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మణిరత్నం స్కూల్‌లో పనిచేసిన అనుభవం కేకేకు దర్శకత్వంలో మంచి పట్టు తీసుకొచ్చింది.
Nagarjuna
ఆ తర్వాత తెలుగులో నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘కేడి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా తర్వాత కొంతకాలం దర్శకత్వానికి విరామం తీసుకున్న ఆయన, మళ్లీ తాజాగా దర్శకుడిగా రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల, దీక్షిత్ శెట్టి హీరోలుగా ‘కేజీక్యూ’ (కింగ్ జాకీ క్వీన్) అనే సినిమాను డైరెక్ట్ చేశారు.
ఆయన ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నట్టు తెలుస్తుండగా, ఆల్రెడీ అయన మరణించినట్టు సోషల్ మీడియాలోవార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన వివరాలు వెలువడలేదు. ఇదిలా ఉండగా, మరిన్ని సినిమాల ద్వారా మల్లి ప్రేక్షకులను అలరిస్తారని అనుకుంటున్న సమయంలోనే ఈ వార్తలు అయన అభిమానులను కలవరపెడుతున్నాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ఆఫీసియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాలి.