వరుస ప్లాపులతో సతమతమవుతున్న చిరంజీవి (Chiranjeevi) ‘ఇంద్ర’ (Indra) తో ఇండస్ట్రీ కొట్టి ఫామ్లోకి వచ్చారు. అదే టైంలో వి.వి.వినాయక్ (V. V. Vinayak) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. అదే ‘ఠాగూర్’ (Tagore) మూవీ. 2003 సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళంలో మురుగదాస్ (A.R. Murugadoss) తెరకెక్కించిన ‘రమణ’ కి ఇది రీమేక్. అయితే ఒరిజినల్ తో పోలిస్తే ‘ఠాగూర్’ లో చాలా మార్పులు చేశాడు దర్శకుడు వి.వి.వినాయక్.
Tagore Collections
ఇక నేటితో ‘ఠాగూర్’ రిలీజ్ అయ్యి 21 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది ‘ఠాగూర్’. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా (Tagore) ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
‘ఠాగూర్’ బాక్సాఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.18.40 కోట్లు. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.27.65 కోట్ల షేర్ ను రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్స్ కి రూ.9.25 కోట్ల లాభాలు మిగిల్చి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది ‘ఠాగూర్’. అయితే కొద్దిలో ‘ఇంద్ర’ రికార్డ్స్ ని మిస్ అయ్యింది.