చిరంజీవికి (Chiranjeevi) కొన్ని జోనర్లలో సినిమాలు చేయాలని ఉంది, అలాగే కొన్ని కథలు అంటే ఫాంటసీ కూడా ఉంది. అందుకే చాలా ఏళ్లుగా ఆ తరహా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఓ సినిమా చేసి ముచ్చట తీర్చుకున్నా.. బాక్సాఫీసు దగ్గర ఆ స్థాయి ఫలితం రాలేదు. ఇక ఇప్పుడు ఆయనకు ఎంతో నచ్చే ఫాంటసీ జోనర్‌లో ఓ సినిమా చేస్తున్నారు. అదే ‘విశ్వంభర’ (Vishwambhara) . ఈ సినిమా గురించే ఇప్పటికే హైప్ ఉన్నా.. దానికి ఇంకా మరింత పెంచేస్తున్నారు.
‘బాహుబలి’ (Baahubali) , ‘బింబిసార’ (Bimbisara) , ‘హనుమాన్’ (Hanuman) .. ఇలా డిఫరెంట్ జోనర్, అబ్బురపరిచే సినిమాలు చేయాలని ఇప్పుడు హీరోలు అందరూ అనుకుంటున్నారు. అలా చిరంజీవి కూడా ఎప్పుడు నుండో అనుకున్నారు. అలా అనుకుని మొదలపెట్టిన సినిమానే ‘విశ్వంభర’. మల్లిడి వశిష్ట (Mallidi Vasishta) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి వస్తుందని ఇప్పటికే సినిమా టీమ్ అనౌన్స్ చేసేసింది కూడా. తాజాగా సినిమా విషయాలు కొన్ని బయటకు వచ్చాయి. గతంలో ‘సైరా’ లాంటి ఇబ్బందికర ఫలితం తర్వాత..
చిరంజీవి ఎంతో జాగ్రత్తగా ‘విశ్వంభర’ సినిమా ఓకే చేశారట. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari), ‘అంజి’ (Anji) తరహాలో ఫాంటసీ టచ్ ఉన్న కథ ఇదని, దానికి హనుమంతుడు అంశం యాడ్ చేస్తున్నామని కూడా టీమ్ చెబుతోంది. ఈ క్రమంలో చిరంజీవి కెరీర్లో టాప్ 5 సినిమాల్లో ‘విశ్వంభర’ ఒకటిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని వశిష్ఠ చెప్పారు. చిరంసీవి అభిమానులు చాలా కాలం గుర్తుంచుకునేలా సినిమాను తెరకెక్కిస్తున్నా అని కూడా చెప్పారాయన. థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను కచ్చితంగా వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారాయన.
దీని కోసం సెట్టింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ భారీ స్థాయిలో సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారాయన. దీంతో చిరంజీవి అభిమానుల్లో అంచనాలను ఇంకాస్త పెంచేసుకుంటున్నారు. దీంతో ఇలాంటి సమయంలో దర్శకుడు మల్లిడి వశిష్ట జాగ్రత్తగా ఉండాలి అని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబు అనే జోవియల్ పాత్రలో కనిపిస్తాడట.