నిన్నమొన్నటివరకూ మన క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం గారికి కమర్షియల్ హిట్ ఏదీ లేదు కాబట్టి ఆయనతో సినిమాలు రూపొందించడానికి నిర్మాణ సంస్థలు ముందుకు రాకపోవడంతో ఆయనే స్వయంగా సినిమాలు నిర్మిస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చాడు. కానీ.. “నవాబ్” చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన తర్వాత మణిరత్నం ప్లాన్ చేసిన ఓ భారీ మల్టీస్టారర్ ఆగిపోయిందనే వార్త ఆయన అభిమానులకు మింగుడుపడడం లేదు.
కార్తీ, జయం రవి, మోహన్ బాబు, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో మణిరత్నం ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేశారు. చోళ సామ్రాజ్యం నేపధ్యంలో తెరకెక్కాల్సిన ఈ హిస్టారికల్ మూవీ బడ్జెట్ ఓవరాల్ గా 150 కోట్లు దాటిపోతుందని గ్రహించిన లైకా సంస్థ ఇప్పుడు అంత రిస్క్ చేయలేమని చెప్పి సైలెంట్ గా సైడైపోయారు. అంత భారీ బడ్జెట్ సినిమాని మణిరత్నం స్వయంగా నిర్మించడం చాలా కష్టం కాబట్టి ఇప్పుడు మరో నిర్మాణ సంస్థ కోసం వెతుకుతున్నారు. మరి ఆయన దర్శకత్వంలో తెరకెక్కబోయే భారీ హిస్టారికల్ మల్టీస్టారర్ ను నిర్మించడానికి ఏ నిర్మాణ సంస్థ ముందుకొస్తుందో చూడాలి.